ఇమ్రాన్ ఖాన్: మేటి క్రికెటర్ నుంచి ప్రధాని వరకు.. పదవీచ్యుత నేత ప్రస్థానం
మాజీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు.
అవినీతిపై పోరాడతానని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని చెబుతూ 2018లో ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
కానీ, ఆయన హామీలన్నీ హామీలుగానే ఉండిపోయాయి. ప్రస్తుతం పాకిస్తాన్‌ను ఆర్థిక సంక్షోభంతోపాటు రాజకీయ సంక్షోభం కూడా ముంచెత్తింది.
గత మార్చిలో పాకిస్తాన్‌లో వరుస పరిణామాల నడుమ పార్లమెంటులో ఆయన ఆధిక్యాన్ని కోల్పోయారు. తన పార్టీ పాకిస్తాన్ తహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన కొందరు సభ్యులపై అనర్హత వేటుతోపాటు కొన్ని పార్టీలు తమ కూటమి నుంచి వెళ్లిపోవడంతో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు అవసరమైన ఆధిక్యం కోల్పోయారు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గలేకపోయారు.
ఇమ్రాన్ ప్రస్థానంపై పూర్తి కథనం ఈ వీడియోలో..
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్
- `గని` రివ్యూ: బాక్సింగ్ రింగ్‌లో తడబడ్డ... హీరోయిజం
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
- షాంఘై లాక్డౌన్: ఆహారం దొరకడం లేదంటున్న కొందరు స్థానికులు
- ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్‌లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?
- పుతిన్‌కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


