‘నాకు కరోనా వచ్చింది.. ఉద్యోగంలోంచి తీసేశారు’

వీడియో క్యాప్షన్, ‘నాకు కరోనా వచ్చింది.. నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు’

హాంకాంగ్‌లో 3 లక్షల మందికి పైగా విదేశీ పనివాళ్లు ఉన్నారు. ఇక్కడి చట్టం ప్రకారం పనివాళ్లు కూడా వారు పనిచేస్తున్న కుటుంబంతో పాటే నివసించాలి.

అయితే, కరోనా మహమ్మారి కారణంగా గత నెల రోజుల్లోనే దాదాపు 40 మంది పనివాళ్లను విధుల్లోంచి తప్పించారని నివేదికలు చెబుతున్నాయి.

తనకు కరోనా వచ్చిందని, దీంతో తన యజమాని తనను ఉద్యోగంలోంచి తీసేశారని ఫిలిప్పీన్స్‌కు చెందిన ఒక మహిళ బీబీసీతో చెప్పారు.

తాను పనికోసం ఎంతగా వెతుకుతున్నా ఉపయోగం లేదని, ఇంటర్వ్యూ వరకూ వెళ్లినా తనకు పని ఇవ్వట్లేదని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)