రష్యాకు మద్దతుగా వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్న సెర్బియన్లు

వీడియో క్యాప్షన్, రష్యాకు మద్దతుగా వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్న సెర్బియన్లు

సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో రష్యాకు అనుకూలంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి.

దాదాపు నాలుగు వేల మంది సెర్బియన్లు శుక్రవారం వీధుల్లోకి వచ్చి, రష్యా జాతీయ పతాకాలు పట్టుకుని నినాదాలు చేశారు.

యుక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో రష్యా గెలవాలని వీరంతా ఆకాంక్షించారు.

ఎన్నో శతాబ్దాలుగా రష్యాకు, సెర్బియాకు మతపరమైన, జాతి పరమైన, రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)