యుక్రెయిన్, రష్యా సంక్షోభం: అణు బాంబులు ఏ దేశం దగ్గర ఎన్నెన్ని ఉన్నాయి?
ప్రపంచంలో తొలి అణ్వాయుధ పరీక్ష అమెరికాలో న్యూ మెక్సికో లోని అలోమాగార్డో ఎయిర్ బేస్ లో 1945 జులై 16వ తేదీన జరిగింది. ట్రినిటీ అనే కోడ్ తో నిర్వహించిన ఈ పరీక్ష జరిగి 76 సంవత్సరాలు అవుతోంది .
ఈ పరీక్ష జరిగిన మరి కొన్ని వారాలలోనే, అదే సంవత్సరం ఆగస్టు 6న జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకి మీద అణు బాంబు ప్రయోగం జరిగింది.
ఈ బాంబు దాడితో హిరోషిమాలో 90000 - 166000 మంది ప్రజలు మరణించారు. నాగసాకి లో 60000 నుంచి 80000 మంది మరణించినట్లు అంచనా. అందులో సగం మరణాలు బాంబు దాడి జరిగిన రోజే చోటు చేసుకున్నాయి.
అణు బాంబు దాడుల వలన నగరాలకు నగరాలే సమూలంగా నాశనమవుతాయి.
న్యూక్లియర్ ఆయుధాలను ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన ఆయుధాలుగా పేర్కొంటారు.
ఎన్ని దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి?
జనవరి 2021 నాటికి ప్రపంచంలో తొమ్మిది దేశాలు అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనా, భారతదేశం, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా న్యూక్లియర్ ఆయుధాలు కలిగి ఉన్నాయి.
పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- నవీన్ శేఖరప్ప: ‘ఆహారం కోసం బంకర్ నుంచి బయటకు వెళ్లాడు.. డబ్బులు కావాలని ఫోన్ చేశాడు.. ఆ తర్వాత’
- వోడ్కా బ్యాన్: యుక్రెయిన్‌పై యుద్ధం ఎఫెక్ట్.. అమెరికా, కెనడాల్లో మద్యం దుకాణాల నుంచి రష్యా వోడ్కా తొలగింపు
- పాశ్యాత్య దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా ఇబ్బందులు పడుతుందా? వాటి ప్రభావం ఎంత?
- యుక్రెయిన్‌లో ‘నాజీ పాలన’ అంతం, నిస్సైనికీకరణే లక్ష్యమని పుతిన్ ఎందుకన్నారు
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)