ఫేస్‌బుక్ పని అయిపోయిందా? సోషల్ మీడియాలో పోటీని ఇక తట్టుకోలేదా?

వీడియో క్యాప్షన్, ఫేస్‌బుక్ పని అయిపోయిందా? సోషల్ మీడియాలో పోటీని ఇక తట్టుకోలేదా?

17 లక్షల కోట్ల రూపాయలు.. ఇందులో ఎన్ని సున్నాలుంటాయని అడిగితే మనలో చాలా మందికి వెంటనే చెప్పడం కూడా కష్టమే. మనకు బాగా తెలిసిన ఫేస్‌బుక్ ఒక్క రోజులో పోగొట్టుకున్న సంపద ఇది.

న్యూజీలాండ్, శ్రీలంక, గ్రీస్ వంటి అనేక ఆసియా, యూరప్, కొన్ని ఆఫ్రికన్ దేశాల జీడీపీ పరిమాణం కూడా 17 లక్షల కోట్ల కంటే తక్కువే.

మరి ఎందుకు ఈ సంస్థ మార్కెట్ విలువ అంతగా పడిపోయింది? రాత్రికి రాత్రే గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ.. మార్క్ జుకర్‌బర్గ్‌ను మించిన శ్రీమంతులుగా ఎలా మారారు?

కొంతకాలంగా మార్కెట్‌లోని ఇతర సంస్థల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది ఫేస్‌బుక్.

కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఇదే మాట అన్నారు. యువతలో టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా యాప్స్‌కు పెరుగుతున్న క్రేజ్‌తో తమకు తీవ్రమైన పోటీ ఎదురవుతోందని చెప్పుకొచ్చారు జుకర్‌బర్గ్.

ఫేస్‌బుక్‌కు గట్టి పోటీ ఇస్తున్న మరొక ప్లాట్‌ఫాం యూట్యూబ్. తక్కువ డ్యూరేషన్ ఉండే షార్ట్ వీడియోలకు ఆదరణ పెరుగుతుండటం టిక్‌టాక్, యూట్యూబ్‌లకు కలిసి వస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)