యుక్రెయిన్‌ను రష్యా ఏం చేయబోతోంది
రష్యా యుక్రెయిన్‌ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు తీవ్రం చేస్తోందా?
రెండు దేశాల సరిహద్దుల్లో పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉందని వివిధ దేశాల నేతలు అంటున్నారు.
యుక్రెయిన్ సరిహద్దుల నుంచి రష్యా తన దళాలను ఉపసంహరించుకోవాలని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ కోరారు.
తూర్పు యుక్రెయిన్‌లో ప్రభుత్వ బలగాలకు, రష్యా మద్దతు ఉన్న వేర్పాటువాదులకు మధ్య పోరులో 14 వేల మంది చనిపోయారు. 10 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
2014లో దక్షిణ యుక్రెయిన్‌లోని నల్ల సముద్ర ద్వీపకల్ప క్రిమియాను రష్యా ఆక్రమించుకుంది.
ఆ తరువాత రష్యా అనుకూల వేర్పాటువాదులు డాన్‌బాస్ ప్రాంతంలోని కొన్ని భాగాలను తమ అధీనంలోకి తీసుకున్నారు.
2015లో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా ఘర్షణలు ఆగలేదు.
మళ్లీ ఇప్పుడు రష్యా, యుక్రెయిన్‌ల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
రష్యా కొన్ని నెలలుగా యుక్రెయిన్ సరిహద్దులు తన బలగాలను భారీగా మోహరించింది.
ఇవి కూడా చదవండి:
- భర్తతో సెక్స్‌కు నో చెప్పే హక్కు భార్యకు లేదా? మ్యారిటల్ రేప్‌పై ఎందుకు చర్చ జరుగుతోంది
- ముంబయి: 20 అంతస్తుల భవనంలో మంటలు - ఆరుగురి మృతి
- అమెరికాను పాలించడం ఎవరివల్లా కాదా? ఈ దేశం ముక్కలైపోతుందా?
- వీర గున్నమ్మ: రైతుల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఈ ఉత్తరాంధ్ర వీర వనిత గురించి తెలుసా?
- ‘మీరు సంసార స్త్రీలు కారు, కుటుంబాలను కూల్చుతారంటూ దూషిస్తారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
