అఫ్గానిస్తాన్ మానవీయ సంక్షోభం: ‘మానవ హక్కులు, పేదరికం గురించి మాట్లాడే దేశాలు ఎక్కడ?’
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ పాలన నేపథ్యంలో ఆ దేశానికి అంతర్జాతీయ సహాయం ఆగిపోయింది.
దీంతో అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మూడు నెలల్లోనే కుప్పకూలింది.
అయితే, ఇదంతా తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్లనే జరగలేదని, ఇంతకు ముందు కూడా పరిస్థితి బాగోలేదని అఫ్గానీయులు బీబీసీతో అన్నారు.
కాబుల్ నగరంలో ప్రజలు ఆహారం కోసం క్యూలలో నిలబడుతున్నారు.
పరిస్థితి దారుణంగా ఉందని సహాయ సంస్థలు అంటున్నాయి.
ప్రపంచం స్పందించాలని తాలిబాన్లు డిమాండ్ చేస్తున్నారు.
దీనికి అంతర్జాతీయ సమాజమే కారణమని వారు నిందిస్తున్నారు.
‘‘మానవ హక్కులు, వాటి పరిరక్షణ, పేదరికం గురించి మాట్లాడే అంతర్జాతీయ సమాజం, ప్రపంచ దేశాలు అఫ్గాన్‌కు సహాయం అందించే దిశగా చర్యలు తీసుకోవాలి’’ అని తాలిబాన్ల ప్రతినిధి సుహైల్ షహీన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 26/11 ముంబయి దాడులు: పాకిస్తాన్లో ఈ కేసు దర్యాప్తు ఎంతవరకూ వచ్చింది?
- క్రిప్టోకరెన్సీలో రూ.70 లక్షల పెట్టుబడులు, ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు..’
- 1993 చిలకలూరుపేట బస్సు దహనం, 23 మంది మృతి.. దోషులకు ఉరిశిక్ష ఎందుకు రద్దు చేశారంటే..
- ఆందోళన రేకెత్తిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కొత్త కరోనా వేరియంట్ B.1.1.529
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు?
- గ్రీన్ టీ: ఉదయాన్నే ఓ కప్పు తాగారా... అందులోని పోషకాలను కనిపెట్టిన మిషియో సుజిమూర కథేంటో తెలుసుకుంటారా?
- ‘కార్లను అమ్మడం మొదలుపెట్టి నెల కూడా కాలేదు.. కానీ మార్కెట్ విలువలో ఫోర్డ్ మోటార్స్‌ను దాటేసింది’
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- హనుమ విహారి ఫౌండేషన్, ఎన్టీఆర్ ట్రస్టు మధ్య గొడవేంటి? ఈ క్రికెటర్ ట్విటర్ నుంచి ఎందుకు తప్పుకున్నాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)