You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కాలిఫోర్నియా సీరియల్ కిల్లర్‌కు మరణ శిక్ష
అమెరికాలో 2001లో ఇద్దరు మహిళలను చంపిన కేసులో దోషిగా తేలిన మైఖేల్ గార్గిలోకు మరణశిక్ష వేశారు.
లాస్ ఏంజెలెస్‌లోని ఓ న్యాయస్థానంలో జడ్జి తీర్పు వెలువరిస్తున్నప్పుడు బాధితుల బంధవులు కన్నీటి పర్యంతమయ్యారు.
'హాలీవుడ్ రిప్పర్'గా పిలిచే మైఖేల్ 2001వ సంవత్సరంలో కాలిఫోర్నియాలో ఆష్లే ఎల్లెరిన్(22), 2005లో మారియా బ్రూనో(32)లను వారివారి ఇళ్లలోనే కత్తితో పొడిచి చంపేశారన్నది ఆరోపణ. పోలీసులు కేసులో ఈ నేరాన్ని రుజువు చేయడంతో ఆయనకు శిక్ష పడింది.
ఆ తరువాత మిషెల్లె మర్ఫీ అనే 26 ఏళ్ల మహిళపైనా దాడి చేయగా ఆమె పోరాడి తప్పించుకుంది. ఆ తరువాత మైఖేల్ పోలీసులకు దొరికారు.
మర్ఫీపై దాడి తరువాత అక్కడి నుంచి పారిపోయినప్పటికీ అక్కడ మైఖేల్ రక్తం ఉండడంతో దాని ఆధారంగా పోలీసులు ఆయన్ను పట్టుకున్నారు.
రెండు హత్యలు, ఒక హత్యాయత్నం అభియోగాలు ఎదుర్కొన్న మైఖేల్ తాను అమాయకుడిననే కోర్టుకు చెప్పేవారు.
మరోవైపు 1993లో ఒక 18 ఏళ్ల అమ్మాయిని చంపిన కేసులోనూ మైఖేల్ ముద్దాయిగా ఉండడంతో ఇల్లినాయిస్‌లో ఈ కేసు విచారణనూ ఆయన ఎదుర్కోనున్నారు.
రెండు దశాబ్దాల కిందట కాలిఫోర్నియాలో జరిగిన ఈ హత్యలు ప్రపంచమంతటా పతాకవార్తలయ్యాయి.
అమెరికన్ నటుడు ఆస్టన్ కుచర్‌తో డేట్‌కి వెళ్లాల్సిన రోజు రాత్రి ఎల్లెరిన్ హత్యకు గురికావడం అప్పట్లో సంచలనంగా మారింది.
ఎల్లెరిన్ కోసం హాలీవుడ్‌లోని ఆమె ఇంటికి వెళ్లిన నటుడు కుచర్ తలుపు తట్టినా ఆమె తీయలేదు. కిటికీలోంచి ఆయన చూడగా నేలపై ఏదో పడినట్లు కనిపించింది. వైన్ పడి ఉంటుందని భావించి వెళ్లిపోయారు.
మరుసటి రోజు ఎల్లెరిన్ శవాన్ని ఇంట్లోనే గుర్తించారు. ఆమె ఒంటిపై 47 కత్తిపోట్లు ఉన్నాయి అప్పుడు.
అనంతరం 2005లో మారియా బ్రూనో(32)ను దారుణంగా హతమార్చాడు మైఖేల్.
అక్కడికి మూడేళ్ల తరువాత మిషెల్లె మర్ఫీపైనా కత్తితో దాడి చేయగా ఆమె తప్పించుకున్నారు. మర్ఫీ ఈ కేసులో కీలక సాక్షిగా మారడంతో మైఖేల్ నేరాలు రుజువయ్యాయి.
కాగా మైఖేల్‌కి మరణ శిక్ష వేసినప్పటికీ కాలిఫోర్నియా రాష్ట్రంలో 2019 నుంచి మరణశిక్షల అమలుపై నిషేధం ఉంది. 2006 తరువాత కాలిఫోర్నియాలో మరణశిక్షలు అమలు కాలేదు.
ఇవి కూడా చదవండి:
- విశాఖ ఏజెన్సీలో గిరిజన గ్రామాలకు రోడ్లు, కరెంటు - బీబీసీ కథనాలకు స్పందన
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'
- దక్షిణాఫ్రికా: జాకబ్ జుమాను జైలుకు పంపడంపై అల్లర్లు, 72 మంది మృతి
- కోవిడ్-19: చైనా వ్యాక్సీన్లను ఇస్తున్న దేశాల్లో మళ్లీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
- ‘12 ఏళ్ల వయసులో పొట్ట పెరుగుతుంటే ఎందుకో అనుకున్నా, గర్భవతినని గుర్తించలేకపోయాను’
- 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)