పేలిన డీఆర్ కాంగోలోని న్యీరగాంగో అగ్నిపర్వతం.. కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు జనం పరుగులు..

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మౌంట్ న్యీరగాంగో అగ్నిపర్వతం పేలింది. దానికి పక్కనే ఉన్న గోమా నగరానికి ముప్పు ముంచుకొచ్చింది.

శనివారం ఈ అగ్నిపర్వతం పేలింది. దాంతో రువాండా సరిహద్దుల్లో ఉన్న గోమా నగరాన్ని ఖాళీ చేయాలని కాంగో ప్రభుత్వం ఆదేశించింది. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అగ్నిపర్వతం నుంచి ఎగసిన పొగలు గోమా నగరాన్ని కమ్మేశాయి.

గోమాలో మొత్తం 20 లక్షల జనాభా ఉంది.

లావా నగరంలో చాలా ప్రాంతాల్లో రోడ్ల పైకి చేరింది.

ఇళ్లలోకి వచ్చింది. కొంతమంది లావా మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు.

నగరంలో భవనాల మధ్య ప్రవహిస్తున్న లావాను పై ఫొటోలో చూడొచ్చు.

స్థానిక ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

లావా.. నగర శివార్లకు, తూర్పున ఉన్న విమానాశ్రయంలోనికి కూడా చేరింది.

అయినా లావా ప్రవాహం ఇంకా తగ్గలేదు.

ఈ అగ్నిపర్వతం విరుంగా నేషనల్ పార్క్‌లో ఉంది.

పరిస్థితి అదుపు తప్పుతోందని అధికారులు చెబుతున్నారు.

దేశంలో పవర్ గ్రిడ్ బ్లాకవుట్ సమస్య ఎదుర్కొంటోంది.

గోమాను, బేనీ నగరంతో కలిపే ఒక హైవే లావాతో కరిగిపోయింది.

అగ్నిపర్వతం పేలుడుతో పిల్లలు, మహిళలు, వృద్ధులు సహా వేలాది మంది ప్రజలు కాంగో పొరుగునే ఉన్న రువాండాలో ఆశ్రయం పొందుతున్నారు.

డీఆర్ కాంగో సరిహద్దులకు అవతల రువాండాలోని గిసెనీ నగరంలో తమ వస్తువులతో ఫుట్‌పాత్‌ల మీదే నిద్రపోయారు.

భూకంపం వచ్చిందనే వార్తలు

నగరంలోని 20 లక్షల మందిని తరలించడానికి భారీ ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

గోమా ప్రజలు అన్నీ వదులుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

గోమాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అగ్నిపర్వతం ఇంతకు ముందు 2002లో పేలింది.

ఆ సమయంలో 250 మంది చనిపోయారు. లక్షా 20 వేల మంది నిరాశ్రయులయ్యారు.

ప్రస్తుతం ఈ అగ్నిపర్వతం పేలుడు వల్ల ఎంత ప్రాణ నష్టం జరిగిందో అధికారులు ఇంకా చెప్పలేదు.

ధ్వంసమైన ఇళ్ల వివరాలు తెలీడం లేదు.

న్యీరగాంగో అగ్నిపర్వతం గోమా నగరానికి, కివు సరస్సుకు 10 కిలోమీటర్లు ఉత్తరంగా విరుంగా నేషనల్ పార్క్‌లో 3,470 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఒక క్రీయాశీల అగ్నిపర్వతం.

ఆల్బర్ట్ నేషనల్ పార్క్ పేరుతో 1925లో ఏర్పాటైన విరుంగా నేషనల్ పార్క్ 7,800 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. యునెస్కో వారసత్వ ప్రదేశాల్లో ఇది ఒకటి.

పార్క్‌లో దాదాపు 500 మంది రేంజర్స్ ఉంటారు. వేటగాళ్లు, అక్రమ బొగ్గు తవ్వకాల నుంచి వాళ్లు ఈ పార్క్‌ను కాపాడుతున్నారు.

All pictures are subject to copyright.