లాస్ట్‌ మీల్స్: మరణానికి ముందు ఆ ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా

అమెరికాలో మరణ శిక్షలను లోతుగా విశ్లేషించాలని ఫోటోగ్రాఫర్ జాకీ బ్లాక్ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా మరణ శిక్ష పడిన ఖైదీలు చివరగా ఎలాంటి ఆహారాన్ని కోరుకున్నారో ఆయన వివరాలు సేకరించారు.

''మీరు చేసిన లేదా చేయని నేరానికి మరణి శిక్ష విధించే ముందు మీరు ఎలాంటి ఆహారం తినాలని అనుకుంటున్నారు?''అని కొందరు ఖైదీలను ఫోటోగ్రాఫర్ బ్లాక్ అడిగారు.

నేరస్థుల ఇతర సమాచారాన్ని కూడా బ్లాక్ సేకరించారు. ఎన్నేళ్లు వారు చదువుకున్నారు? ఎలాంటి పనులు చేశారు? చివరగా వారు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? లాంటి ప్రశ్నలను అడిగారు.

డేవిడ్ వేన్ స్టోకర్

మరణ శిక్ష అమలైన రోజు: 16 జూన్ 1997

చదువు : ఎనిమిది

వృత్తి : హెవీ ఎక్వీప్‌మెంట్ ఆపరేటర్/కార్పెంటర్

చివరి మాట: "మీకు జరిగిన నష్టానికి క్షమాపణలు.. కానీ నేను ఎవరినీ చంపలేదు''

ఆంటొనీ రే వెస్ట్‌లీ

మరణ శిక్ష : 13 మే 1997

చదువు : ఎనిమిది

వృత్తి : కూలీ

చివరి మాట : "నేను ఎవరినీ చంపలేదని చెప్పాలని అనుకుంటున్నా. అందరినీ ప్రేమిస్తున్నా''

థామస్ ఆండీ బేర్‌ఫూట్

మరణ శిక్ష : 30 అక్టోబర్ 1984

చదువు : తెలియదు

వృత్తి : చమురు కార్మికుడు

చివరి మాట: ''మనం ఇప్పుడు చేస్తున్న తప్పుపై ఏదో ఒకరోజు పశ్చాత్తప పడతామని భావిస్తున్నా. వారిపై నాకు ఎలాంటి కోపం లేదనీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నా. నేను అందరినీ క్షమించేస్తున్నా. నన్ను కూడా అందరూ క్షమించాలని ఆశిస్తున్నా''.

''చనిపోయిన వ్యక్తి భార్య మనుసులో నాపై ఉండే ద్వేషం పోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ ద్వేషం ఆమెను నరకానికి పంపిస్తుంది. అందరికీ క్షమాపణలు''

జేమ్స్ రసెల్

మరణ శిక్ష : 19 సెప్టెంబర్ 1991

చదువు : 10

వృత్తి : గాయకుడు

చివరి మాట : మూడు నిమిషాలపాటు ఆయన మాట్లాడారు. అయితే దాన్ని ఎక్కడా రికార్డ్ చేయలేదు.

జెఫెరీ అలెన్ బెర్నీ

మరణ శిక్ష : 16 ఏప్రిల్ 1986

చదువు : తెలీదు

వృత్తి : తెలీదు

చివరి మాట : "నేను చేసిన పనులకు క్షమించమని వేడుకుంటున్నా. నాకు ఇలా కావాల్సిందే"

జానీ ఫ్రాంక్ గ్యారెట్

మరణ శిక్ష : 11 ఫిబ్రవరి 1992

చదువు : 7

వృత్తి : కూలీ

చివరి మాట :"నన్ను ప్రేమిస్తున్న, నా కోసం ఆలోచిస్తున్న నా కుటుంబానికి ధన్యవాదాలు. మిగతా అందరూ ఏమనుకున్నా ఫరవాలేదు''

విలియం ప్రిన్స్ డేవిస్

మరణ శిక్ష : 14 సెప్టెంబర్ 1999

చదువు : 7

వృత్తి : కూలీ

చివరి మాట : "నా వల్ల చాలా బాధపడిన కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. నన్ను ఎంతగానో ప్రేమించిన తోటి ఖైదీలకు ధన్యవాదాలు''

''నా శరీరాన్ని సైన్స్ ప్రయోగాలకు దానం చేస్తే.. కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. అంతే ఇంకేమీ చెప్పాలని అనుకోవట్లేదు''.

గెరాల్డ్ లీ మిషెల్

మరణ శిక్ష : 22 అక్టోబరు 2001

విద్య : 10

వృత్తి : కార్పెంటర్

చివరి మాట : ''నేను చేసిన పనికి క్షమాపణలు చెబుతున్నా. నేను ఒకరిని హత్య చేశాను. నన్ను క్షమించాలని దేవుణ్ని వేడుకుంటున్నాను. మిమ్మల్ని కూడా అదే అడుగుతున్నా. ఇది కొంచెం కష్టమే. కానీ నన్ను క్షమించండి''

''నా కుటుంబంలో అందరినీ ప్రేమిస్తున్నాను. అందరూ ధైర్యంగా ఉండండి. నా ప్రేమ ఎప్పుడూ మీతో ఉంటుంది. నేను దేవుడి దగ్గరకు వెళ్తానని నాకు తెలుసు. నా కోసం ఆనందబాష్పాలు చిందించండి''

రాబర్ట్ ఆంటొనీ మ్యాడెన్

మరణ శిక్ష : 28 మే 1997

విద్య : 12

వృత్తి : వంట నిపుణుడు

చివరి మాట : ''మీకు జరిగిన నష్టానికి క్షమాపణలు చెబుతున్నా. కానీ నేను ఎవరినీ చంపలేదు. అందరూ ఎవరు గురించి వారు తెలుసుకుంటారని ఆశిస్తున్నా. ద్వేషం, పగ లాంటివి వదిలిపెట్టి అసలైన అంశాలపై అందరూ దృష్టిపెట్టాలని కోరుకుంటున్నా''.

''ప్రస్తుతం జరుగుతోంది తప్పు. అయితే దీన్ని చేస్తున్నవారిని క్షమిస్తున్నా''

జేమ్స్ బేథార్డ్

మరణశిక్ష : 9 డిసెంబర్ 1999

విద్య : 15

విద్య : మోటర్‌సైకిల్ మెకానిక్

ఈ కేసులో విచారణ పూర్తయిన తర్వాత కీలక సాక్షి తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు. దోషికి క్షమాభిక్ష పెట్టాలని ముగ్గురు పెరోల్ బోర్డు సభ్యులు సూచించారు.

చివరి మాట: ''నా కుటుంబం నాపై చూపించిన ప్రేమతో దీన్ని మొదలుపెట్టాలని అనుకుంటున్నా. ఈ ప్రపంచంలో ఎవరికీ దొరకనంత మంచి కుటుంబం నాకు దొరికింది. ప్రపంచంలో అందరికంటే అద్భుతమైన జీవితాన్ని నేను గడిపాను. నా కొడుకు, కూతురు విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను''

''ఈ పరిస్థితుల్లో నేను చెప్పేది ప్రజలు వినాలని అనుకుంటారు. అందుకే కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నా. నేడు అమెరికాలో మనిషి జీవితానికి విలువలేదు. నా మరణం ఓ పెద్ద సామాజిక వ్యాధికి కేవలం ఒక లక్షణం మాత్రమే. ఏదో ఒక సమయంలో ప్రభుత్వం మేలుకోవాలి. అమాయకపు చిన్నారులను చంపడం, ఇతర దేశాల్లో విధ్వంసాలు చేయడం లాంటివి మానుకోవాలి. ఇరాన్, ఇరాక్, క్యూబా లాంటి దేశాలపై విధిస్తున్న ఆంక్షలు ఎలాంటి మార్పులను తీసుకురావడం లేదు. కేవలం అమాయకపు చిన్నారులను బలి తీసుకుంటున్నాయి''

''అన్నింటికంటే పర్యావరణానికి మనం చేస్తున్న హాని గురించి ముఖ్యంగా చెప్పాలి. ఇదే దిశలో మనం వెళ్తూ ఉంటే.. భూమి తుడిచిపెట్టుకుపోతుంది''.

''కేవలం పత్రికా స్వేచ్ఛ ఉన్నప్పుడే నిజం బయటకు వస్తుంది. ఏం జరుగుతుందో ప్రజలకు తెలుస్తుంది. ఓ స్వేచ్ఛాయుత సంస్థగా మనుగడ సాగించేందుకు మీడియా నేడు కష్టపడుతోంది''

న్యూయార్క్‌లోని ద ప్యారిష్ ఆర్ట్ మ్యూజియంలో ఈ ‘లాస్ట్ మీల్స్‌ స్టోరీని ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)