You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: మాస్కో రైలు ప్రయాణికులను హడలెత్తించిన ప్రాంక్‌స్టర్
కరోనావైరస్ బాధితుడిలా నటించి రష్కాలోని మాస్కోలోని ఓ రైలులో హఠాత్తుగా కిందపడిపోయిన ఓ వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో.. కదులుతున్న ఓ రైలులో మాస్క్ ధరించిన ఓ వ్యక్తి తూలిపోతూ కిందపడిపోగా సాటి ప్రయాణికులు ఆయనకు సహాయపడేందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది.
ఆ వెంటనే ఆయన గిలగిలా కొట్టుకోవడంతో సహాయపడుతున్నవారు, అక్కడ సీట్లలో కూర్చున్నవారు కూడా భయంతో పారిపోవడం కనిపిస్తుంది.
కాగా నేరపూరితంగా తుంటరితనంతో రైలు ప్రయాణికులను భయపెట్టారన్న కారణంతో ఆ తుంటరిని మాస్కో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దోషిగా తేలితే ఆ ప్రాంక్‌స్టర్‌కు అయిదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఆ ప్రాంక్‌స్టర్‌ను అరెస్టు చేసినట్లు రష్యా అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రి సోమవారం తెలిపారు. ప్రాంక్‌స్టర్ కిందపడి గిలగిలా కొట్టుకుంటుంటే కరోనావైరస్ బాధితుడంటూ అరిచిన మరో ఇద్దరి కోసం వెతుకుతున్నట్లు చెప్పారు.
''ఆయనతో ఉన్నవారు ప్రయాణికుల్లో భయం కలిగించేలా అతడికి ప్రమాదకర వైరస్ సోకిందని అన్నారు'' అంటూ రష్యా ఇంటీరియర్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి ఇరినా వోక్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
రష్యాకు చెందిన వెస్టి న్యూస్ వెబ్‌సైట్ ప్రాంక్‌స్టర్ రైలులో చేసిన పనికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేసింది.
మొదట ఫిబ్రవరి 2నే కారా.ప్రాంక్ అనే వెబ్‌సైట్‌లో ఈ వీడియో పబ్లిష్ అయినప్పటికీ తరువాత దాన్ని తొలగించారు.
ప్రాంక్‌స్టర్ తరఫున ఆయన లాయర్ మాట్లాడుతూ.. ''నా క్లయింట్ షాక్ తిన్నారు. ప్రాంక్ తరువాత ఆయనేమీ దాక్కోలేదు. ఇలా అరెస్ట్ చేస్తారని ఊహించలేదు. విచారణ జరుపుతున్న అధికారి కూడా కేసు కొట్టేయొచ్చేమోనని అన్నారు'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సొమాలియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం.. మిడతల దండయాత్రే కారణం
- 2022లోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న నిర్మల.. ఇది సాధ్యమేనా?
- ‘వీళ్లు అధికారంలో లేకపోతే ప్రపంచం మెరుగ్గా ఉండేది’.. ట్రంప్, జిన్‌పింగ్ పాలనపై జార్జ్ సోరస్ విమర్శలు
- బడ్జెట్ 2020: కొత్త ఆదాయపన్ను శ్లాబులు.. నిజంగానే పన్ను ఆదా చేస్తాయా
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- BBC Indian Sportswoman of the Year-2019: అవార్డ్ నామినీలు వీరే; 'భారత మహిళలు చరిత్ర లిఖిస్తున్నారు' -రూపా ఝా, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ హెడ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)