జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత

ఫొటో సోర్స్, Getty Images
జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. ఆయన వయసు 95 ఏళ్లు. జింబాబ్వేకు స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఆ దేశానికి చెందిన తొలితరం నాయకుడు ముగాబే.
అనారోగ్యంతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారని ముగాబే కుటుంబ సభ్యులు బీబీసీకి తెలిపారు. గత ఏప్రిల్ నెల నుంచి ఆయన సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
దాదాపు మూడు దశాబ్దాలకు పైగా జింబాబ్వేను పరిపాలించిన ముగాబే పాలన 2017 నవంబర్‌లో.. ఆయన్ను పదవీచ్యుతిడిని చేయడంతో ముగిసింది.
‘‘రెస్ట్ ఇన్ పీస్ (శాంతి) ముగాబే’’ అని జింబాబ్వే విద్యా శాఖ కార్యదర్శి ఫద్యాజీ మెహెరె ట్వీట్ చేశారు.
రొడీషియా (జింబాబ్వే పాత పేరు)లో 1924 ఫిబ్రవరి 21వ తేదీన ముగాబే జన్మించారు.
1964లో రొడీషియా ప్రభుత్వాన్ని విమర్శించినందుకుగాను పదేళ్లకు పైగా ఆయన ఎలాంటి విచారణ లేకుండానే జైలు జీవితం గడపాల్సి వచ్చింది.
1973లో జైలులో ఉండగానే ఆయన జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ (జను) రాజకీయ పార్టీకి అధ్యక్షుడయ్యారు.
స్వతంత్ర జింబాబ్వే తొలి ప్రధాని.. తర్వాత అధ్యక్షుడు
స్వతంత్రం సాధించుకున్న తర్వాత జింబాబ్వేలో 1980లో జరిగిన తొలి ఎన్నికల్లో ముగాబే విజయం సాధించి, ప్రధానమంత్రి అయ్యారు. 1987లో ప్రధాని పదవిని రద్దు చేసి, దేశానికి అధ్యక్షుడయ్యారు.
దేశంలోని మెజార్టీ నల్ల జాతీయులకు విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపర్చడం ద్వారా ముగాబే తన తొలినాళ్లలో బాగా పేరుతెచ్చుకున్నారు.
అయితే, వివాదాస్పద భూ సంస్కరణల కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో చివరి సంవత్సరాల్లో ఆయన పాలనపై హక్కుల ఉల్లంఘన, అవినీతి ఆరోపణలు పెరిగాయి.
కాగా, ముగాబే స్థానంలో జింబాబ్వే అధ్యక్షుడైన ఎమర్సన్ మన్‌గాగ్వా.. ముగాబే మృతికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. ముగాబేను ‘జింబాబ్వే పితామహుడు’, ‘విముక్తికి సంకేతం’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇవి కూడా చదవండి:
- జింబాబ్వే సంక్షోభం:పార్టీ అధ్యక్ష పదవి నుంచి ముగాబే తొలగింపు!
- ముగాబే ముందున్న మార్గాలివే!
- గృహ నిర్బంధంలో రాబర్ట్ ముగాబే
- ‘ముగాబేకు ముర్దాబాద్.. సైన్యానికి జిందాబాద్’
- జింబాబ్వే: ఎవరీ గ్రేస్ ముగాబే? ఎందుకీ సంక్షోభం?
- గ్రేస్ ముగాబే పొలంలో బంగారం తవ్వేస్తున్నారు!
- జింబాబ్వేలో జరుగుతోంది తిరుగుబాటేనా?
- జింబాబ్వేతో భారత్‌కున్న బంధమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











