You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీర్యదాత చట్టపరంగా తండ్రి: ఆస్ట్రేలియా కోర్టు తీర్పు
ఆస్ట్రేలియాకు చెందిన ఒక వీర్యదాత 11 ఏళ్ల బాలికకు తండ్రయ్యారు.
వీర్యదాత బాలికకు చట్టపరమైన తండ్రి అని ఆస్ట్రేలియా అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
బాలికతోపాటు ఆమె తల్లి న్యూజీలాండ్‌కి వెళ్లిపోకుండా అడ్డుకునేందుకు అతను న్యాయపోరాటం చేశారు.
అయితే, కింది కోర్టు అతని అభ్యర్థనను కొట్టివేసింది. బాలికపై అతనికి చట్టపరమైన హక్కులు లేవని కింది కోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పుపై అతను ఆస్ట్రేలియా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కడ తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది.
అసలు వివాదం ఏమిటి?
49 ఏళ్ల వ్యక్తి 2006లో బాలిక తల్లికి వీర్యదానం చేశారు. అప్పుడు ఆ మహిళ ఒంటరిగా ఉండేది. ఆమెకు అతను స్నేహితుడు కూడా. బాలికను ఇద్దరు కలిసి పెంచుకోవాలని మొదట్లోనే ఇద్దరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్లు విడిపోయారని అతడి లాయర్లు చెప్పారు. అయితే, పాప అతడిని నాన్న అని పిలిచేదని కూడా చెప్పారు. చిన్నారి పుట్టిన తేదీ సర్టిఫికేట్‌లో కూడా అతన్ని తండ్రిగా పేర్కొన్నారు.
ఈ కేసులో బుధవారం తీర్పు ఇచ్చిన ఆస్ట్రేలియా అత్యున్నత న్యాయస్థానం అతడికి చట్టబద్దమైన తండ్రిగా గుర్తించాలని ఆదేశించింది. అలాగే, ఆ కుటుంబం న్యూజీలాండ్ వెళ్లకుండా అడ్డుకుంది.
రొమాంటిక్ భాగస్వామిగా ఉండడానికి అంగీకరించని స్నేహితురాలితో కలిసి తన బిడ్డను పెంచడం ప్రతి తండ్రికీ కీలకం అని అతడి లాయర్ బీబీసీకి చెప్పారు.
తల్లిదండ్రుల్లో ఒకరికి కూడా చట్టపరమైన హోదాను ఇవ్వవచ్చని కోర్టు తెలిపింది. బిడ్డ జీవితంలో తన పాత్రను పోషించవచ్చని చెప్పింది.
అయితే, చట్టపరమైన సమస్యల కారణంగా కోర్టులో రెండు పక్షాల గుర్తింపును బయటపెట్టలేదు.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక: యుద్ధంలో బద్ధ శత్రువులు ప్రేమలో పడ్డారు
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- శాండ్విచ్ జనరేషన్ అంటే ఏమిటి? మీరు ఈ కోవలోకి వస్తారా?
- సానియా మీర్జా: ‘నేను పాకిస్తాన్ జట్టుకు తల్లిని కాదు’
- చెన్నైలో తాగునీటికి కటకట: వర్షాలు పడకుంటే మురుగునీరే దిక్కా?
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- "అమ్మాయిలు ఐస్‌క్రీమ్‌లను నాకుతూ తినొద్దు"
- శోభనం రాత్రి బెడ్షీట్లు ఏం నిరూపిస్తాయి? పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి?
- హాంకాంగ్ నిరసనల ముఖ చిత్రం ఇతడే.. పేరు జాషువా.. వయసు 22 ఏళ్లు.. లక్షలాది మందిని ఎలా కదిలించాడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)