You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శాండ్‌విచ్ జనరేషన్ అంటే ఏమిటి? మీరు ఈ కోవలోకి వస్తారా?
30-50 ఏళ్ల మధ్య వయసుండి.. ఒకవైపు తల్లిదండ్రులు, మరోవైపు పిల్లల బాధ్యత కలిగినవారే శాండ్‌విచ్ జనరేషన్ అంటే! ఈ జనరేషన్ వ్యక్తుల జీవితం ఎలా ఉంది? బీబీసీ.. శాండ్‌విచ్ జనరేషన్‌కు చెందిన కొందరు మహిళలను పలకరించింది. ఆఫీస్ పనులు, పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యతల మధ్య నలిగిపోతున్నామని వారు చెబుతున్నారు.
‘‘మీరు చెబుతున్నట్లే, మేం శాండ్‌విచ్ అవుతున్నాం. ఒకవైపు ఆఫీసు, మరోవైపు పిల్లలు, అత్తమామలు. పనులు చక్కబెట్టాలంటే కష్టపడటం మాత్రమే కాదు కదా, వారితో కాస్త సమయం గడపాలి. లేకపోతే వారిని నిర్లక్ష్యం చేస్తున్నామని భావిస్తారు’’ అని 34 ఏళ్ల దీపా జోషి అన్నారు.
కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో గడపడానికి, వారి బాగోగులు చూసుకోవడానికి సమయం సరిపోదని పూజ అనే మహిళ అన్నారు. పిల్లల పరీక్షల సమయంలో ఒకవేళ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోకపోతే, అప్పుడు ఏంచేయాలో అర్థం కాదని, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించడం కష్టమని ఆమె అన్నారు. ఇంకా...
‘‘హాలిడేస్‌కు ఎక్కడకు వెళ్లాలన్న విషయంలో పెద్దవాళ్లతో ఏకాభిప్రాయం కుదరదు. ఎక్కడికి వెళ్లాలన్నది కూడా పెద్ద సమస్యే’’ అని పూజ అన్నారు.
హెల్ప్ ఏజ్ ఇండియా సర్వే ప్రకారం, తల్లిదండ్రులను చూసుకుంటున్నవారిలో 29% మంది, ఆ బాధ్యతలను భారంగా ఫీల్ అవుతున్నారు. దేశంలోని 20 నగరాల్లో ఈ సర్వే చేశారు.
మరి ఇలాంటి బాధ్యతల నడుమ నలిగిపోతున్నామని మహిళలు చెబుతోంటే, పిల్లలు, మహిళల తల్లిదండ్రులు ఏమంటున్నారో, ఆ మహిళల జీవితాలను మూడు కోణాలనుంచి తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
- తమిళులు హిందీని ఎందుకు అంతలా వ్యతిరేకిస్తున్నారు...
- పాకిస్తాన్ బడ్జెట్: ఈ అప్పుల 'విషవలయం' నుంచి ఇమ్రాన్ ఖాన్ బయటపడేది ఎలా?
- కష్టమైన ఇంగ్లిష్ స్పెల్లింగుల్ని మార్చేయడం కరెక్టేనా?
- ట్రావెల్ ఫొటో పోటీలు 2019: చూపుతిప్పుకోనివ్వని ఫొటోలు... విజేతలు వీరే
- స్విట్జర్లాండ్: సమాన వేతనం, గౌరవం కోసం రోడ్డెక్కిన మహిళలు
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
- అర్థరాత్రి దాటినా నిద్ర పోవట్లేదా? మీ జీవ గడియారాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఎలా?
- తియానన్మెన్ స్క్వేర్ నరమేధాన్ని సమర్థించిన చైనా మంత్రి, అసలు ఆరోజు ఏం జరిగింది
- భవిష్యత్ బాగుండాలంటే ప్రజాస్వామ్యాన్ని మార్చాల్సిందేనా?
- చైనాలో వ్యభిచార వ్యాపారం.. సెక్స్ బానిసత్వంలో మగ్గిపోతున్న ఉత్తర కొరియా అమ్మాయిలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)