You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గాజా ఘర్షణ: ఇజ్రాయెల్ దాడులతో తగలబడుతున్న గాజాస్ట్రిప్
ఒకవైపు ఇజ్రాయెల్ దళాలు, మరోవైపు గాజా స్ట్రిప్‌లో తీవ్రవాదులు పరస్పర దాడులను తీవ్రం చేశారు. ఇరు పక్షాల మధ్య ఇటీవలి కాలంలో అత్యంత తీవ్ర దాడుల్లో ఇది ఒకటి.
పాలస్తీనా మిలిటెంట్లు శనివారం నుంచి ఇజ్రాయెల్ ప్రాంతంలోకి 430 పైగా రాకెట్లను పేల్చారు. వాటిలో అత్యధిక రాకెట్లను మధ్యలోనే అడ్డుకున్నామని, అయినప్పటికీ ఒక వ్యక్తి చనిపోయాడని ఇజ్రాయెల్ పేర్కొంది.
రాకెట్ దాడులకు ప్రతిగా ఈ వారాంతంలో గాజా స్ట్రిప్‌లోని సుమారు 200 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) తెలిపాయి.
ఆ దాడుల్లో నలుగురు వ్యక్తులు చనిపోయారని పాలస్తీనియన్లు చెప్పారు.
ఇరు పక్షాలు గత నెలలో సంధికి అంగీకరించినప్పటికీ ఈ ఘర్షణ చెలరేగటం గమనార్హం. దీర్ఘకాలిక కాల్పుల విరమణకు ఇరు పక్షాలనూ ఒప్పించాలని ఈజిప్ట్, ఐక్యరాజ్యసమితులు కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాయి.
తాజా హింస ఎలా చెలరేగింది?
గాజా దిగ్బంధానికి వ్యతిరేకంగా శుక్రవారం అక్కడ భారీ నిరసనలు జరిగినపుడు ఈ హింస మొదలైంది. మిలిటెంట్లకు ఆయుధాలు అందకుండా ఉండటానికి ఆ దిగ్బంధం అవసరమని ఇజ్రాయెల్ అంటోంది.
సరిహద్దు కంచె వద్ద ఇద్దరు ఇజ్రాయెల్ సైనికుల మీద పాలస్తీనా గన్‌మన్ ఒకరు కాల్పులు జరపటంతో ఒక సైనికుడు చనిపోయాడు.
ఇజ్రాయెల్ దీనికి ప్రతిగా వైమానిక దాడి చేయటంతో ఇద్దరు హమాస్ మిలిటెంట్లు చనిపోయారు.
శనివారం ఉదయం గాజా నుంచి వరుసపెట్టి రాకెట్ల దాడి మొదలైంది. ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకున్న ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థ డజన్ల కొద్దీ రాకెట్లను కూల్చివేసింది. కానీ ఇజ్రాయెల్‌లోని అనేక పట్టణాలు, గ్రామాలను ఆ రాకెట్లు తాకాయి.
గాజాకు ఉత్తరంగా 10 కిలోమీటర్ల దూరంలో ఇజ్రాయెల్‌లో గల అష్కెలాన్‌లో ఇంట్లో ఉన్న ఒక వ్యక్తికి షార్పెనల్ తాకి చనిపోయాడు.
శుక్రవారం నాటి హింసకు ప్రతిగా తాము రాకెట్ దాడి ప్రారంభించామని ఇస్లామిక్ జిహాద్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయటంలో ఇజ్రాయెల్ విఫలమైందని కూడా విమర్శించింది.
హమాస్, ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ సంస్థలకు చెందిన ప్రాంతాలపై శనివారం, ఆదివారం తాము వైమానిక దాడులు చేసి ఇద్దరు పాలస్తీనా ఫైటర్లను హతమార్చామని ఇజ్రాయెల్ చెప్తోంది.
అయితే.. గాజాను నియంత్రించే హమాస్ మాత్రం నలుగురు పాలస్తీనియన్లు చనిపోయారని అంటోంది.
మృతుల్లో ఒక మహిళ, ఆమె 14 నెలల కూతురు కూడా ఉన్నారని చెప్తోంది. కానీ.. పాలస్తీనా రాకెట్ లక్ష్యాన్ని చేరుకోకముందే పేలటం వల్ల ఆ తల్లీబిడ్డలు చనిపోయి ఉండవచ్చునని ఇజ్రాయెల్ అంటోంది.
గాజాలో దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ దిగ్బంధం వల్ల, విదేశీ సాయంలో ఇటీవల కోతలు విధించటం వల్ల వీరందరూ ఆర్థికంగా చాలా కష్టాల్లో పడ్డారు.
- భారత్-ఇజ్రాయెల్‌ల రొమాన్స్‌లో గాఢత కొరవడిందా?
- ‘కశ్మీర్‌పై భారత్‌కు ఇజ్రాయెల్ దారి చూపిస్తోందా?’
- ఇజ్రాయెల్: శత్రువును ప్రేమతో ఉచ్చులో పడేసే 'మొసాద్' మహిళా గూఢచారి కథ
- గాజా: మళ్లీ ప్రాణం పోసుకున్న గ్రాండ్ పియానో
- ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏం జరుగుతోంది...
- మూడు కళ్ల పామును ఎప్పుడైనా చూశారా...
- స్కూలు నుంచి ఇంటికెళ్లాలంటే.. రెండు విమానాలు మారాలి, 5 రోజులు కొండలు ఎక్కాలి
- సోషల్ మీడియాలో వలవేసి.. ఇండియాలో అమ్మేస్తున్నారు
- మోదీ 200 టన్నుల బంగారాన్ని విదేశాలకు తరలించారా...
- ఐపీఎల్ 2019: సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే-ఆఫ్‌కు చేరేదెలా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)