You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మూడు కళ్ల పామును ఎప్పుడైనా చూశారా?
ఆస్ట్రేలియాలోని ఓ హైవే పక్కన మూడు కళ్లున్న ఓ పామును వన్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు.
"ఇది ఓ అసాధారణమైన పాము ఫొటో" అంటూ 'నార్తర్న్ టెర్రిటరీ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్' దీని ఫొటోలను విడుదల చేసింది.
'మాంటీ పైథాన్'గా పిలుస్తున్న ఈ పామును మార్చిలో తొలిసారి గుర్తించారు. కానీ కొన్నివారాల్లోనే అది చనిపోయింది.
తల పైభాగంలో ఉన్న మూడో కన్ను సహజసిద్ధంగా ఉన్నట్లే ఉందని నిపుణులు అంటున్నారు.
డార్విన్ నగరానికి 40 కి.మీ. దూరంలో ఉన్న హంప్టీ డూ పట్టణ సమీపంలో అధికారులు దీన్ని గుర్తించారు. 40 సెం.మీ. (15 అంగుళాలు) పొడవున్న ఈ పాము తలపై ఉన్న మూడో కన్ను కారణంగా ఆహారం తీసుకోవడంలో చాలా ఇబ్బందులు పడిందని అధికారులు బీబీసీతో అన్నారు.
అయితే, ఈ పాముకు రెండు తలలు లేవని ఎక్స్-రేలో స్పష్టమైందని వన్యప్రాణి విభాగం అధికారులు తెలిపారు.
"చూడటానికి ఒకే తల (పుర్రె)లా ఉంది. కానీ అదనంగా ఓ కంటి కుహరం ఉంది. దీనివల్లే ఈ పాముకు మూడు కళ్లు వచ్చాయి" అని వారు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
పరిణామక్రమంలో ఉత్పరివర్తనాలు చోటుచేసుకోవడం సాధారణ విషయం అని పాములపై పరిశోధన చేసిన క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రియాన్ ఫ్రై తెలిపారు.
"ప్రతి జీవిలో ఏదో ఒక పరివర్తనం జరుగుతుంది. అయితే ఈ పాములో అది కొద్దిగా అసహజంగా జరిగింది. ఇంతకు ముందెప్పుడూ నేను మూడు కళ్లున్న పామును చూళ్లేదు. కానీ మా ల్యాబ్‌లో రెండు తలల పాము ఉంది. ఇది మనం చెప్పుకునే సయామీ కవలల విషయంలో జరిగిన జన్యుమార్పుల వంటి వాటివల్ల జరిగినదే" అని ప్రొఫెసర్ ఫ్రై అన్నారు.
బహుశా ఈ పాము తలపై ఉన్న మూడో కన్ను పూర్తిగా తయారు కాని దాని కవల పాముకు చెందినది కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి.
- అడవిని నేలమట్టం చేస్తున్న బుల్డోజర్ను ప్రతిఘటించిన ఒరాంగుటాన్
- పాము కాటు: ఏ పాములు ప్రమాదకరం? కాటేసినపుడు ఏం చేయాలి?
- పాము కాటేశాక ఏమవుతుంది? శాస్త్రవేత్త స్వీయ మరణగాథ
- బ్రెజిల్లో చిలుకను అరెస్టు చేసిన పోలీసులు
- ఈ చేపలు ఈత కొట్టవు, కాళ్లతో నడుస్తాయ్
- ఈ ఆవు ఎత్తే దాని ప్రాణాలను కాపాడింది... ఎలాగో తెలుసా?
- మోదీ 200 టన్నుల బంగారాన్ని విదేశాలకు తరలించారా...
- నవీన్ పట్నాయక్ పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డు బద్దలు కొట్టగలరా
- ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలను కోర్టులో సవాల్ చేయవచ్చా...
- గడ్చిరోలి: నక్సల్స్ వ్యతిరేక కార్యక్రమాల్లో పోలీసులే సమిధలవుతున్నారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)