You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆలయ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తామని డీఎంకే చెప్పిందా - Fact Check
తమిళనాడులో డీఎంకే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను లక్ష్యంగా చేసుకొని రచయిత, విద్యావేత్త మధు పూర్ణిమ కిష్వర్ చేసిన ఒక ట్వీట్ చర్చనీయమైంది.
''ఆలయ భూములను ఆక్రమించుకొన్న వారికి వాటిని క్రమబద్ధీకరిస్తాం, వాటిపై యాజమాన్య హక్కు కల్పిస్తాం అని డీఎంకే మేనిఫెస్టోలో 112వ పేజీలో ఉంది. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకొని తిరిగి వక్ఫ్ బోర్డ్‌కు అప్పగిస్తాం అని 85వ పేజీలో ఉంది'' అని ఆమె ట్వీట్‌లో రాశారు.
ఈ ట్వీట్‌ను పెద్దసంఖ్యలో ట్విటర్ యూజర్లు చూశారు. వేల సంఖ్యలో షేర్ కూడా చేశారు.
కానీ ఆమె ట్వీట్‌లో చెప్పిన మాటలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నెల 19న ప్రకటించించిన డీఎంకే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో ఆ పార్టీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
మేనిఫెస్టోలోని మొత్తం పేజీలు 76 మాత్రమే. మధు కిష్వర్ చెప్పిన పేజీలు 85, 112 అందులో లేనే లేవు.
మధు కిష్వర్ ట్వీట్‌పై డీఎంకే అధికార ప్రతినిధి మనురాజ్ ఎస్ ట్విటర్‌లో స్పందిస్తూ- ఇది నకిలీ వార్త అని ఆయన ఖండించారు.
మేనిఫెస్టోలో వక్ఫ్ బోర్డు గురించిగాని, ఆక్రమణల గురించిగాని ప్రస్తావనే లేదు. అందులో మత వ్యవహారాల ప్రస్తావన ఆఖరి అధ్యాయంలో ఉంది. మతాన్ని, మత సామరస్యాన్ని కాపాడతామని మాత్రమే అందులో ఉంది.
మధు కిష్వర్ ట్వీట్‌లోని సమాచారం డీఎంకే 2016 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోకు కొంచెం దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది.
ఆక్రమణలకు గురైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకొని, వాటికి రక్షణ కల్పిస్తామని నాటి మేనిఫెస్టోలోని 85వ పేజీలో ఉంది.
ఆలయ భూములను రక్షిస్తామని 111వ పేజీలో హిందూ మత, ధార్మిక ఎండోమెంట్ విభాగం(హెచ్‌ఆర్‌సీఈ) ఉపశీర్షిక కింద రాసి ఉంది.
ఆలయ భూములపై ఆలయ ట్రస్టు కౌలు వసూలు వ్యవహారాలను క్రమబద్ధీకరిస్తామని, ఆలయాలకు చెందిన ఖాళీ భూముల పరిరక్షణకు భూనిధి ఏర్పాటు చేస్తామని డీఎంకే అందులో పేర్కొంది.
చట్ట నిబంధనలకు లోబడి ఆలయ భూముల కొనుగోలుకు ముందుకు వస్తున్న ప్రజల డిమాండ్లు పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా అందులో రాశారు.
2016 మేనిఫెస్టోలో వక్ఫ్ భూములే కాదు ఆలయ భూముల పరిరక్షణ గురించి కూడా డీఎంకే హామీ ఇచ్చింది.
2019 మేనిఫెస్టోలో మధు కిష్వర్ ట్వీట్‌లో చెప్పినవి లేవు.
ఇవి కూడా చదవండి:
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- ఒంగోలు గిత్తల కథ: ఇక్కడ అరుదై పోయాయి.. బ్రెజిల్లో వెలిగిపోతున్నాయి
- పాక్‌లో వైరల్ అవుతున్న ఆ పైలట్ వీడియో బెంగళూరులోది
- న్యూజీలాండ్ క్రైస్ట్‌చర్చ్ మసీదు కాల్పులు: ఆత్మీయులను కోల్పోయిన వారి అంతరంగం
- ట్రంప్-రష్యా: అధ్యక్ష ఎన్నికల ప్రచార ఆరోపణలపై నివేదిక సమర్పించిన రాబర్ట్ ముల్లర్
- గాంధీనగర్: అమిత్ షా పోటీచేస్తున్న బీజేపీ కంచుకోట చరిత్ర
- ''మసీదుకు మేం కేవలం 50 గజాల దూరంలో ఉన్నాం.. ఐదు నిమిషాలు ముందు వెళ్లుంటే ఏమైపోయేవాళ్లమో" - బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మేనేజర్
- BBC Reality Check: విమానాశ్రయాల నిర్మాణాలపై బీజేపీ లెక్కల్లో నిజమెంత?
- ‘మా ఊరిలో పిల్లల్ని కనకూడదు, ఎవరైనా చనిపోతే పూడ్చకూడదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)