You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉద్యోగులను ఆఫీసులో ఎక్కువ సేపు పనిచెయ్యనివ్వని డ్రోన్
ఈ డ్రోన్ జపాన్‌లోని ఓ ఆఫీసులో గస్తీ తిరుగుతోంది. ఇది ఎందుకు అలా తిరుగుతోందో తెలుసా?
ఉద్యోగులు ఏం చేస్తున్నారో, వారి పనితీరు ఎలా ఉందో చూడటానికి కాదు. వాళ్లు సమయానికి ఇంటికి వెళ్తున్నారా లేదా చూసేందుకు.
జపాన్‌లో ఎక్కువ సమయం ఆఫీసుల్లో గడపడం చాలామంది ఉద్యోగులకు మామూలైపోయింది.
"సమయం ముగిశాక కూడా ఇంటికి వెళ్లకుండా ఆఫీసుల్లో ఎవరుంటున్నారో ఈ డ్రోన్‌లో ఉన్న కెమెరా ద్వారా తెలుసుకుంటాం" అని టీఏఐఎస్ఈఐ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నొరిహిరో కటో అంటున్నారు.
జపాన్ చట్టాల ప్రకారం ఓ ఉద్యోగి నెలలో 100 గంటలకు మించి అదనపు సమయం పని చేయకూడదు.
కరోషి... అంటే పనిచేస్తూ ఆఫీస్‌లోనే చనిపోవడం. కొన్ని దశాబ్దాలుగా ఇది జపాన్‌ను తీవ్రంగా వేధిస్తున్న సమస్య.
ఎక్కువ సమయంపాటు పనిచేయడాన్ని నివారించేందుకు కంపెనీలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికోసం టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నాయి.
వాటిలో భాగమే... కళ్ల కదలికలను పసిగట్టే ఓ కొత్తరకం కళ్లజోళ్లు.
ఈ కళ్లజోళ్లు అవి పెట్టుకున్నవారి కళ్ల కదలికల సమాచారాన్ని సేకరించి, విశ్లేషిస్తాయి. మీ ఏకాగ్రత తగ్గితే, కాసేపు విరామం తీసుకోమని ఫోన్లకు సందేశం పంపిస్తాయి.
జపాన్‌లో దశాబ్దాలుగా ఉన్న ఈ అధిక సమయం పనిచేసే ఈ అలవాటును టెక్నాలజీ మారుస్తుందేమో చూడాలి.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)