కుంభమేళా2019: 70 ఏళ్ల కిందట కుంభమేళా ఎలా జరిగిందో తెలుసా?

ప్రయాగ రాజ్ లో కుంభ మేళా ఘనంగా జరుగుతోంది.

ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ కూడా పవిత్ర సంగమంలో స్నానం చేశారు.

ఈ నేపథ్యంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948లో తొలి కుంభ మేళా ఎలా జరిగింది..?

అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని కుంభ మేళాలను , అర్థ కుంభ మేళాలను చూసిన ప్రముఖ రేడియో జర్నలిస్ట్, ప్రయాగ రాజ్‌కి చెందిన నరేశ్ మిశ్రాను బీబీసీ కలిసింది.

ఆయన తన అనుభవాలను ఇలా పంచుకున్నారు.

స్వతంత్ర భారతంలోనే అది తొలి పండగ. నిజానికి అది కుంభ మేళా కాదు, కేవలం అర్థ కుంభ్ మాత్రమే.

అప్పట్లో జనాలు చాలా తక్కువ. అర్థ కుంభమేళా జరిగే స్థలంలో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉండే వాళ్లు.

పండగ రోజు జనాలంతా కలిసి స్నానం చేసి తిరిగి వెళ్లిపోయే వారు. అందు వల్ల నగరంపై పెద్ద ఒత్తిడి ఉండేది కాదు.

ప్రయాగ రాజ్ లోని సంగమ ప్రాంతం... ఒక తపోవనంలా ఉండేది.

రామ్ లీలా, రాస్ లీలా ఉత్సవాలు కూడా జరిగేవి.

ఇక్కడంతా ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది.

కానీ నేడు ఈ ఉత్సవాల తీరు తెన్నులు పూర్తిగా మారిపోయాయి.

నాడు రాత్రి వేళల్లో ఇన్ని లైట్లు ఉండేవి కావు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బల్బులుండేవి.

కానీ ఇప్పుడు సంగమ ప్రాంతంలో లక్షలాది బల్బులు వెలుగులు విరజిమ్ముతున్నాయి.

ప్రస్తుతం ఈ ఉత్సవం... మహోత్సవంగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)