కుటుంబ నియంత్రణ పద్ధతులకు దూరంగా పాక్ ప్రజలు, ఐక్యరాజ్యసమితి ఆందోళన
పాకిస్తాన్‌లో ఏటా 20 లక్షల గర్భస్రావాలు జరుగుతున్నాయి. ఆ దేశంలో కుటుంబ నియంత్రణ ఎంత అవసరమో ఈ గణాంకాలు చెబుతున్నాయని ఐక్యరాజ్య సమితి అంటోంది.
అప్పటికే పిల్లలు ఉండడంతో, ఇంకో బిడ్డ వద్దనుకొని గర్భస్రావం చేయించుకునే కేసులే ఎక్కువగా ఉంటున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల రేటు 3.2గా ఉండగా పట్టణాల్లో అది 2.8గా ఉంది.
34శాతం మహిళలు మాత్రమే కుటుంబ నియంత్రణ కోసం వివిధ మార్గాలను అవలంబిస్తున్నట్లు పాకిస్తాన్ డెమోగ్రాఫిక్ సర్వే చెబుతోంది. 2020 నాటికి ఇది 50 శాతానికి పెరగాల్సి ఉంది.
కొందరు భర్త అనుమతితో కుటుంబ నియంత్రణ పద్ధతి ఎంచుకున్నా.. కుటుంబ ఒత్తిళ్లతో ఆ పద్ధతిని విరమించుకోవాల్సి వస్తోంది.
గత ఏడాది జనవరి, నవంబరు మధ్య... థట్టా, సుజావల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 13,441 మంది మహిళలు ప్రసవించారు.
ఆ సమయంలో కనీసం 10 శాతం మంది కూడా కుటుంబ నియంత్రణ పాటించలేదు.
ప్రతి అయిదుగురిలో ఒక మహిళ కుటుంబ నియంత్రణను పాటించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి చెబుతోంది.
అయితే మెరుగైన కుటుంబ నియంత్రణ పద్ధతులు మహిళలకు ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఇలా వెంటవెంటనే గర్భం దాల్చడం ద్వారా మాతాశిశు మరణాల రేటు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆసియా బీబీ: 'దైవదూషణ కేసులో ఆమె నిర్దోషి...' మళ్ళీ తీర్పు చెప్పిన పాక్ సుప్రీం కోర్టు
- గాంధీజీ మెచ్చిన పెన్ను రాజమండ్రిలో తయారైంది
- చంద్రుని మీద మొలకెత్తిన చైనా పత్తి విత్తనం
- వర్జినిటీని మూత తీయని సీసాతో పోల్చుతారా ? : అభిప్రాయం
- సరదాగా సెల్ఫీ తీసుకుంటున్న ‘సైతాను’ రేపిన వివాదం
- హరప్పా నాగరికతనాటి ‘దంపతుల’ సమాధి చెబుతున్న చరిత్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)