చంద్రగ్రహణం పేరులో తోడేలు ఎందుకు చేరింది?

వీడియో క్యాప్షన్, చంద్రగ్రహణం పేరులో తోడేలు ఎందుకు చేరింది?

జనవరి 21న ఉదయం సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దాని పేరు ''సూపర్ బ్లడ్ ఉల్ఫ్ (తోడేలు) మూన్''.

భారత కాలమానం ప్రకారం జనవరి 21న ఉదయం 9 గంటలకు చంద్ర గ్రహణం ప్రారంభమవుతుంది. 10.11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అది 62 నిమిషాల పాటు కొనసాగుతుంది.

అయితే, ఈ చంద్రగ్రహణం భారత్‌లో ఉండేవారికి కనిపించదు. ఉత్తర మరియు దక్షిణ అమెరికాలో, ఉత్తర యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో, వాయవ్య ఆఫ్రికా తీర ప్రాంతంలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)