You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రధాని నరేంద్ర మోదీని ఓ కార్టూన్‌తో పోల్చిన అర్జెంటీనా న్యూస్ చానెల్: ‘ఇది జాత్యహంకారమే’
భారత ప్రధాని మోదీని ఓ కార్టూన్‌తో పోలుస్తూ అర్జెంటీనా న్యూస్ చానెల్ 'క్రానికా టీవీ' చేసిన ప్రసారాలు వివాదాస్పదమయ్యాయి.
అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ నగరంలో జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. అందులో పాల్గొనడానికి భారత ప్రధాని మోదీ అర్జెంటీనా వెళ్లారు.
ఈ సందర్భంగా మోదీ విమానం 'బ్యూనస్ ఎయిర్స్' నగరంలో ల్యాండ్ అవ్వగానే, క్రానికా టీవీలో.. 'అపు వచ్చేశాడు' అన్న హెడ్‌లైన్‌తో ఓ కార్టూన్ ప్రత్యక్షమైంది.
మోదీని ఆవిధంగా చూపెట్టడం జాత్యాహంకార చర్య అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో యూజర్లు విరుచుకుపడుతున్నారు.
'అపు నాహాసపీమపెటలన్' పేరుతో క్రానికా టీవీలో ఓ కార్టూన్ సిరీస్ 1990 నుంచి ప్రసారమవుతోంది. ఈ కార్టూన్‌కు హ్యాంక్ ఆజారియా అనే శ్వేతజాతి నటుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అపు కార్టూన్ భారతీయ యాసలో మాట్లాడుతుంది.
‘అపు’ వివాదం ఇప్పటిది కాదు
ఇండియన్-అమెరికన్ స్టాండప్ కమెడియన్ హరి కొండబోలు 2017లోనే అపు కార్టూన్‌పై ఓ డాక్యుమెంటరీ చిత్రించారు. అపు కార్టూన్ జాత్యాహంకారానికి ప్రతీక అని ఆ డాక్యుమెంటరీలో అభిప్రాయపడ్డారు.
ఈ డాక్యుమెంటరీ గురించి హరి కొండబోలు బీబీసీతో మాట్లాడుతూ..
''ఈ సిరీస్‌లో అపు పాత్రను లోకువగా చూపిస్తున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న అపు పాత్రకు ఎంతమంది పిల్లలని చూపెడుతున్నారు? ఈ సిరీస్‌లో అన్ని పాత్రలు మూస ధోరణిలో ఉన్నాయి'' అన్నారు.
క్రానికా టీవీ తాజా ప్రసారాలపై హరి కొండబోలు స్పందిస్తూ.. ‘ఇది నిజం కాదు కదా..’ ట్వీట్ చేశారు.
ఈ ఘటనపై చాలా మంది స్పందించారు. ‘దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించలేం. ఆయన మా ప్రధాని. అంతర్జాతీయ వేదికపై ఇతర దేశాల నేతల్లాగే మోదీని కూడా గౌరవించాలి’ అని జయన్ టి.భూషణ్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
జీ20 సదస్సులో పాల్గొనడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ కూడా బ్యూనస్ ఎయిర్స్ విమానాశ్రయం చేరుకున్నారు. కానీ ఆయనకు స్వాగతం పలకడానికి అర్జెంటీనా ప్రతినిధులు ఎవ్వరూ సమయానికి రాలేదు.
ఈ సంఘటనపై కూడా సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
- BBC Special: తాజ్‌మహల్: ‘జాగ్రత్తపడకపోతే... జ్ఞాపకమే మిగిలుతుంది’
- మీ పిల్లల స్కూలు బ్యాగ్ బరువు ఎంతుండాలో తెలుసా
- రాహుల్ గాంధీకి 'కౌల్' గోత్రం ఎలా వచ్చింది
- డిజైనర్ బేబీస్: జన్యు సవరణ శిశువుల సృష్టి ఆమోదయోగ్యమేనా
- క్రీ.శ.536: చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం అదే
- పాక్ జైల్లో 22 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు : వీరు విడుదలయ్యేది ఎప్పుడు?
- ‘న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వంతో మాకు ఎలాంటి ఉపయోగం లేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)