You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మీ పిల్లల స్కూలు బ్యాగ్ బరువు ఎంతుండాలో తెలుసా
ఉదయం, సాయంత్రం కిలోల కొద్దీ బరువున్న బ్యాగులను భుజానేసుకుంటూ భారంగా ముందుకు కదిలే స్కూల్ పిల్లలు చాలామంది కనిపిస్తుంటారు. కానీ, ఇకపై అలాంటి దృశ్యాలు తగ్గిపోయే అవకాశం ఉంది.
స్కూల్ పిల్లల బ్యాగుల బరువు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టింది.
వాటి ప్రకారం ఒకటి, రెండో తరగతి చదివే విద్యార్థుల బ్యాగుల బరువు 1.5కిలోలకు మించకూడదు. మూడు నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థుల బ్యాగు బరువు 2-3 కిలోల మధ్య ఉండాలి.
గరిష్టంగా పదో తరగతి చదివే విద్యార్థుల బ్యాగు బరువు 5కేజీలు మించకూడదు.
ఈ కొత్త మార్గదర్శకాల వల్ల పిల్లలతో పాటు తమ సమస్యలూ తీరతాయని కొందరు తల్లిదండ్రులు అంటున్నారు.
‘మా అబ్బాయికి మూడు నెలలకోసారి కొత్త బ్యాగు కొంటుండాలి. పుస్తకాల బరువు కారణంగా అవి త్వరగా చిరిగిపోతుంటాయి.
ఒక్కో సబ్జెక్టుకు ఐదారు పుస్తకాలుంటాయి. బరువు కారణంగా భుజాలు, చేతులు నొప్పిగా ఉంటాయని తరచూ చెబుతుంటాడు. వాడి ఎదుగుదల కూడా సరిగా లేదు. ఈ కొత్త నిబంధన సరిగ్గా అమలైతే ఆ సమస్య తీరొచ్చు’ అని దిల్లీకి చెందిన ఓ విద్యార్థి తండ్రి చెప్పారు.
చిన్న వయసు పిల్లలు ఎక్కువ బరువు మోస్తే వారి వారి శరీరాకృతి దెబ్బతినే అవకాశం ఉంది. భుజాలు, మెడ, నడుము భాగాల్లో నొప్పి కలుగుతుంది. అలసట, నీరసంగా అనిపిస్తుంది. విసుగు, తలనొప్పి లాంటి సమస్యలూ ఎదురవుతాయి.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)