వీడియో: ఫేక్ న్యూస్ బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలి?
ఫేక్ న్యూస్ అనేది.. ఒకరకంగా యాపిల్ పండు లాంటిది.
అది పైనుంచి చూడడానికి ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ, లోపల కుళ్లిపోయి ఉండొచ్చు. అలాగే, ఫేక్ న్యూస్ కూడా అంతే. చూసేందుకు నమ్మదగిన వార్తగానే ఉండొచ్చు. కానీ, అది బూటకపు వార్త కూడా కావచ్చు.
మరి మనం ఏం చేయవచ్చు?
ఎవరు? ఎందుకు? ఎప్పుడు? ఎలా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
మీకు ఆ 'యాపిల్' ఎవరు పంపించారు? వాళ్లు నమ్మదగిన వాళ్లేనా? అని ఒక్కసారి పరిశీలించండి. ఆ వార్తను ప్రచురించిన వెబ్‌సైట్ గురించి ఆరా తీయండి. దానికి ఎలాంటి పేరుంది? అనేది చూడండి.
ఆ సమాచారం వెనుక ఏవైనా ఉద్దేశాలు ఉన్నాయా? అన్న కోణంలో ఆలోచించాలి.
దాన్ని ఎవరు పంపించారు? వాళ్లకు ఏవైనా బయటకు కనిపించని అజెండా ఉందా? అని చూడాలి.
వాళ్ల రాజకీయ ఉద్దేశాలు ఏమిటి? వాటిని వ్యాప్తి చేయడానికి వాళ్లకు ఎవరైనా నజరానాలు ఇస్తున్నారా? అని కూడా ఆలోచించాలి.
అది ఎప్పటిది?
నెలలు, సంవత్సరాల కిందటి ఘటనలకు సంబంధించిన వార్తలు కూడా తాజాగా జరిగినట్లుగా అప్పుడప్పుడు కొందరు షేర్ చేస్తుంటారు.
అందుకే, మీకు ఎవరైనా ఒక వార్తను పంపిస్తే... అది ఎప్పటిది? అని కూడా పరిశీలించాలి.
ఎవరు? ఎందుకు? ఎప్పుడు? ఎలా? అని ఆలోచించడం మరచిపోకండి. ఒకరి నుంచి ఒకరికి నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా అడ్డుకోండి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)