You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బిగ్‌బాస్ పెద్దన్న 'బిగ్ బ్రదర్' ఇక కనిపించడు
తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం బిగ్‌బాస్ రెండో సీజన్ కొనసాగుతోంది. బాహ్య ప్రపంచానికి దూరంగా ఒక ఇంట్లో కొందరు సెలబ్రిటీలను ఉంచి వారానికి ఒకరిని ప్రజల ఆన్‌లైన్ ఓట్ల ప్రాతిపదికన బయటకు పంపే ఈ టీవీ షోను నిత్యం వేలాది మంది చూస్తున్నారు.
ఎంతో డ్రామా, మరెన్నో వివాదాలు, వినోదంతో రక్తికట్టిస్తూ వివిధ భారతీయ భాషల్లో ప్రసారమవుతున్న ఇలాంటి షోలకు మాతృక బ్రిటన్‌కు చెందిన ఇంగ్లిష్ చానల్ 'చానల్ 5'లో వచ్చే బిగ్ బ్రదర్.
ఇప్పుడా బిగ్ బ్రదర్ షోను ఆపేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. శుక్రవారం రాత్రి నుంచి బిగ్ బ్రదర్ 19వ సీజన్ మొదలవుతుండగా.. ఇదే చివరి సీజన్ అని.. ఇది ముగిశాక ఇక బిగ్ బ్రదర్ వచ్చే ఏడాది నుంచి ఉండదని ట్విటర్ వేదికగా చానల్ 5 ప్రకటించింది. దీంతోపాటుగా సెలబ్రిటీ బిగ్‌బ్రదర్ షో కూడా నిలిపివేయనున్నారు.
బిగ్ బ్రదర్ షో మొట్టమొదట 2000 సంవత్సరంలో మొదలైనప్పుడు విపరీతమైన జనాదరణ పొందింది.
కానీ, ఇటీవల కాలంలో వీక్షకులు తగ్గారని గణాంకాలు చెబుతున్నాయి.
తొలుత ఈ షో చానల్ 4లో ప్రసారమయ్యేది. 2010 నుంచి చానల్ 5కి మారింది.
మరిన్ని కథనాలు
- మిమ్నల్ని ఇష్టపడేదెవరో తెలుసుకోండి
- ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్టూ వేధింపేనా?
- ఈ ఏడాది ఎక్కువ మంది వాడిన పదమేంటో తెలుసా?
- #MeToo: ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాను
- ‘మగాళ్లు చేస్తే ఒప్పు ఆడవాళ్లు చేస్తే తప్పా?’
- 'చనిపోయాకా చాటింగ్ చేయొచ్చు'
- వేధించారంటే ఉద్యోగాల్లోంచి ఊస్టే!
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
- శరీరం వెలుపల చిట్టి గుండె: క్షేమంగా ఇంటికి చేరిన చిన్నారి
- రూపాయి: ఈ పతనం దేనికి ఆరంభం?
- చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్: 'ఇదో చిన్న కేసు.. మీడియానే పెద్దది చేసి చూపిస్తోంది'
- లైంగికానందం కోసం మహిళలు సెక్స్ చేయటం సరికాదని మహాత్మా గాంధీ ఎందుకన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)