అరుదైన గోల్డెన్ ఈగల్స్‌కు వందేళ్ల నాటి వైభవం తిరిగి వస్తుందా?

వీడియో క్యాప్షన్, అరుదైన గోల్డెన్ ఈగల్స్

పదేళ్ల ప్రణాళికల అనంతరం... గోల్డెన్ ఈగల్స్‌గా పిలిచే పక్షుల సమూహాన్ని దక్షిణ స్కాట్లాండ్ లోని ఓ రహస్య ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ పక్షులు ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాల్లోని గూళ్లలోంచి వాటిని అక్కడికి తీసుకెళ్లారు. దక్షిణ స్కాట్లాండ్‌లో ఈ పక్షులిప్పుడు ఐదు జంటలకన్నా ఎక్కువ లేవు. ఇంగ్లాండ్, వేల్స్‌లలోనైతే అసలే లేవు.

స్కాట్లాండ్‌లో గోల్డెన్ ఈగల్ జాతి పక్షులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాయి. తమ పశు సంపదపై ఈ పక్షులు దాడి చేస్తున్నాయంటూ రైతులు వీటిని చంపుతున్నారు. కానీ ప్రాజెక్ట్ నిర్వహకులు మాత్రం.. ఈ ప్రయత్నాన్ని అందరూ ఆహ్వానిస్తారన్న నమ్మకంతో ఉన్నారు.

వందేళ్ల క్రితం గోల్డెన్ ఈగల్ పక్షులు వృద్ధి చెందిన ప్రాంతాలకు ఈ పక్షులు చేరుకుంటాయని వీరి ఆశ..

ఈ గోల్డెన్ ఈగల్ సంతతికి వందేళ్ల క్రితం ఉన్న వైభవం తిరిగి వస్తుందని వీరి ఆశ..

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)