సింగపూర్ వీధుల్లో కాలినడకన తిరిగిన కిమ్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశానికి ముందు ఉత్తర కొరియా పాలకుడు కిమ్ సోమవారం రాత్రి ఆకస్మికంగా సింగపూర్‌లో పర్యటించారు.

కాలినడకనే తిరుగుతూ సింగపూర్ నగర అభివృద్ధిని, అందాల్ని తిలకించారు.

కిమ్‌ వెంట భద్రతా సిబ్బందితో పాటు సహాయకులు, కొందరు సింగపూర్ అధికారులు ఉన్నారు.

మెరీనా రిజర్వాయర్ సమీపంలో ఉన్న 'గార్డెన్స్ బై ద బే' పార్కును సందర్శించారు.

తర్వాత మెరీనా బే శాండ్స్ హోటల్ వద్ద కాసేపు ఆగారు.

కిమ్ వెంట సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్ కూడా ఉన్నారు.

తర్వాత జూబ్లీ వంతెనపై తిరిగారు. సింగపూర్ పర్యటన ద్వారా తాను చాలా నేర్చుకున్నాని కిమ్ అన్నారు.

ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌తో సెల్ఫీకి పోజిస్తున్న సింగపూర్ మంత్రి బాలకృష్ణన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)