You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒకప్పటి 'దెయ్యాల ఊరు'.. ఇప్పుడు పర్యాటకులకు 'స్వర్గధామం'
చైనా తూర్పు తీరాన ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో షెంగ్‌షాన్ అనే చిన్న దీవి ఉంది. ఆ దీవిలో హౌటౌవాన్ అనే ఊరుంది.
గ్రామస్థులంతా ఈ ఊరును విడిచి వెళ్లిపోయారు. కానీ, ఈ గ్రామమే ఇప్పుడు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఈ ఫొటోలు చూస్తే మీరు కూడా ఔరా! అనకుండా ఉండరు.
ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు చెందిన ఫొటో జర్నలిస్టు జొహన్నెస్ ఈసెలీ ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రకృతి అందాల్ని తన కెమెరాలో బంధించి తీసుకొచ్చారు.
ఒకప్పుడు హౌటౌవాన్ గ్రామంలో 2,000 మందికి పైగా మత్స్యకారులు, తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉండేవారు. 500కు పైగా ఇళ్లు ఉండేవి.
అయితే, ఇది మారుమూల ప్రాంతం కావడంతో ఇక్కడ విద్య, వైద్యం వంటి సదుపాయాలు పెద్దగా ఉండేవి కాదు. ఆహారపదార్థాల రవాణా సమస్య కూడా ఉండేది.
దాంతో 1990ల్లో స్థానికులు ఒక్కొక్కరుగా ఈ దీవిని విడిచి మెరుగైన వసతులు ఉన్న ప్రాంతాలకు తరలిపోవడం ప్రారంభించారు.
అలా 1994 కల్లా దాదాపు అన్ని కుటుంబాలూ వెళ్లిపోయాయి.
అంతా నిర్మానుష్యంగా మారడంతో భారీగా పెరిగిన పచ్చని చెట్ల తీగలు ఇళ్లను కప్పేశాయి.
దాంతో పార్కుల్లో ముస్తాబు చేసినట్టుగా మారిపోయిన ఆ భవనాలు, పర్యాటకుల మనసు దోచేస్తున్నాయి.
ప్రకృతి రమణీయతకు నిలయంగా ఉన్న ఈ దీవి చక్కని టూరిస్టు స్పాట్‌గా మారిపోయింది.
ప్రస్తుతం కొద్ది మంది మాత్రమే ఇక్కడ నివాసముంటున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)