You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మీ లంచ్‌ని తోటి ఉద్యోగి దొంగిలిస్తే.. అదో వైరల్!
మనలో చాలా మందికి ఈ ‘కడుపు మంట’ ఎప్పుడో ఒకప్పుడు ఎదురై ఉంటుంది.
మీరు ఇంట్లో ఉదయాన్నే లేచి.. చాలా జాగ్రత్తగా నోరూరించే.. రుచికరమైన వంట చేసుకుని.. దాన్ని బాక్స్‌లో పెట్టుకుని ఆఫీసుకు తీసుకెళ్లారు.
ఆఫీసులో అందరూ వాడుకునే ఫ్రిడ్జిలోనో లేక కేంటీన్‌లోనో లంచ్ బాక్స్‌ను ఉంచారు.
మధ్యాహ్నమైంది. చాలా ఆకలితో మీరు బాక్స్ తెరచి చూశారు. కానీ అది అప్పటికే స్వాహా అయిపోయింది.
అప్పుడు మీకు ఎలా ఉంటుంది..??
సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది లాస్ఏంజెలిస్‌లోని జాక్ టోస్కానీకి.
దీంతో సహచర ఉద్యోగులు ఆ బాక్స్ దొంగ కోసం ఆరా తీయడం మొదలు పెట్టారు.
ఈ ఘటన వివరాలను జాక్ టోస్కానీ ట్విటర్లో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయింది.
ఇప్పటికే ఆ ట్వీట్‌కి 4.6 లక్షల లైకులొచ్చాయి.
ట్విటర్లో తన ట్వీట్‌కి వచ్చిన స్పందన చూసి టోస్కానీ ఆశ్చర్యపోయారు.
‘‘ఇది ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు. నా స్నేహితులను ఉద్దేశించి పెట్టిన ట్వీటిది. నిజంగా దానికి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయా..’’ అని బీబీసీతో అన్నారు.
‘ఇలా చాలా మంది స్పందించడం బాగుంది. దీన్ని బట్టి నాలాగే చాలా మంది బాధితులు ఉంటారనుకుంటున్నాను. ఆ లంచ్ ఎవరు తిన్నారో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాల్సిందిగా.. నా సహచరుడిని హెచ్‌ఆర్ వాళ్లు కోరారు’ అని టోస్కానీ వివరించారు.
ఆ లంచ్ బాక్స్‌లో రుచిరకమైన ఫ్రైడ్ రైస్ ఉన్నట్లు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాక.. బాక్స్ దొంగ ఎవరో తెలిసిపోయింది.
తర్వాత ఆ కంపెనీ ఇతరుల లంచ్ బాక్స్‌లను చోరీ చేయొద్దు.. అంటూ అందరికీ మెయిల్స్ పంపింది.
పట్టుబడిన దొంగ.. ఆ విషయం గురించి ఎందుకు ఫిర్యాదు చేశావ్ అని టోస్కానీని ప్రశ్నించాడు.
దీంతో జాక్ మరో మూడు ఫ్రైడ్ రైస్‌లు ఆర్డర్ చేసి.. అందరికీ పంచారు.
33 ఏళ్ల జాక్ కమెడియన్ కూడా. ఆ ట్వీట్లు వైరల్ అయినపుడు తాను ఆఫీసులో లేనని వివరించారు.
ఆ బాక్స్‌ను ఎవరు దొంగిలించి ఉంటారు.. అని సహచర ఉద్యోగి ప్రశ్న వల్ల తాను ఆ ట్వీట్ చేశానని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)