You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్: మారని రోహింజ్యాల దీన గాథ
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మయన్మార్ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని బంగ్లాదేశ్ వెళ్లిన శరణార్థుల పరిస్థితిలో నెలలు గడిచినా ఇప్పటికీ ఎలాంటి మార్పు కనిపించడంలేదు. సహాయక కేంద్రాల్లో పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలతోనే వాళ్లంతా రోజులు గడపాల్సి వస్తోంది.
"ఉపాధి లేదు. కడుపు నిండా తిండి దొరకట్లేదు, సరైన వైద్య సదుపాయాలు లేవు" అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ ప్రాంతంలోని శిబిరాల్లో ఉంటున్న హిందూ, ముస్లిం రోహింజ్యా శరణార్థులను కలిశాము.
ఆగస్టులో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న తర్వాత లక్షల మంది సరిహద్దు దాటి బంగ్లాదేశ్‌లోకి వెళ్లారు. దాదాపు ఆరు నెలలు గడిచినా నేటికీ తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అర్థంకాని పరిస్థితిలో వారంతా ఉన్నారు. వారిలో వేలాది మంది హిందూ రోహింజ్యాలు కూడా ఉన్నారు.
ఈ రోహింజ్యాలను వెనక్కి పంపేందుకు బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలు అంగీకరించాయంటూ ఇటీవల వార్తలొచ్చాయి.
అందరూ రెండు నెలల్లోపు తిరిగి వెళ్లవచ్చునని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
అయితే, తమకు సరైన భద్రత కల్పిస్తామని రెండు దేశాలు రాతపూర్వకంగా స్పష్టమైన హామీ ఇస్తేనే తమ సొంతూళ్లకు వెళ్తామని బాధితులు అంటున్నారు.
ఇవి కూడా చూడండి:
- రోహింజ్యా సంక్షోభం: ఒక్క నెలలోనే 6,700కు పైగా హత్యలు
- రోహింజ్యా సంక్షోభంతో పర్యావరణానికీ ప్రమాదం
- రోహింజ్యాల రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆంగ్ సాన్ సూచీ
- గ్రౌండ్ రిపోర్ట్: రఖైన్లో హిందువులను హతమార్చిందెవరు?
- రాత్రివేళ వీధి కుక్కల నడుమ బీబీసీ ప్రతినిధి సాహసం
- #HerChoice: నేను సింగిల్.. పెళ్లి చేసుకోనంటే అందరూ తప్పుబట్టారు
- అద్దాల రైలులో ఆంధ్రా ఊటీకి వెళ్లొద్దామా!
- సిరియాపై ఇజ్రాయెల్ భీకర దాడులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)