ద.కొరియా శీతాకాల ఒలింపిక్స్‌లో ఉ.కొరియా ‘సైనిక ప్రదర్శన’

దక్షిణ కొరియాలో శీతాకాల ఒలింపిక్స్ మొదలయిన తర్వాతి రోజే ఉత్తర కొరియా.. తమ సైన్యం 70వ వార్షిక వేడుకలను నిర్వహించాలని భావిస్తోంది.

సైనిక దళాలు ఏర్పాటైన రోజును పురస్కరించుకుని ప్యాంగ్యాంగ్‌లో సైనిక కవాతు నిర్వహిస్తారు. గత ఏడాది ఏప్రిల్లో ఈ వేడుకలు జరిగాయి. 40 ఏళ్లుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.

అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 8న కవాతు నిర్వహించాలని ఉత్తర కొరియా నిర్ణయించింది.

ఈ అంశంపై మాట్లాడటానికి ఎవరికీ హక్కు లేదని పేర్కొంటూ.. తమపై వస్తున్న విమర్శలను ఆ దేశం కొట్టి పారేసింది.

‘ప్రపంచంలో ఏ దేశమైనా తమ సైన్యం ఏర్పడిన రోజును పురస్కరించుకుని చాలా వైభవంగా వేడుకలు నిర్వహిస్తుంది. ఇదో సంప్రదాయం. ఆనవాయితీ.. ’ అని ఉత్తర కొరియా పేర్కొంది.

మరోవైపు ‘శీతాకాల ఒలింపిక్స్ పై ద‌ృష్టి కేంద్రీకరించాలంటే సైనిక కవాతు చేయకుండా ఉండటమే మంచిది..’ అని అమెరికా పేర్కొంది.

13000 దళాలు, 200 ఆయుధాలు, ఇతర సామగ్రిని ప్యాంగ్యాంగ్‌లోని విమానాశ్రయంలో ఉంచినట్లు దక్షిణ కొరియా అధికారులు తెలిపారు.

కొరియా ‘సైన్యం ’ 1948లో ఫిబ్రవరి 28న ఏర్పాటైంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)