వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన కవలలు!

సాధారణంగా కవలలు ఒకే రోజు పుడతారు. సమయంలో కాస్త తేడా ఉన్నా.. అదే రోజు జన్మిస్తారు.

కానీ ఈ అమెరికా కవలలు కాస్త డిఫరెంట్.

వీళ్లు పుట్టింది ఒకే రోజు కాదు. కనీసం ఒకే ఏడాది అంటే 2017లోనూ కాదు.

వకీస్ జూనియర్‌, ఐతన డి జీసస్‌లకు హలో చెప్పండి.

వీరిలో ఒకరు 2017లో పుట్టగా మరొకరు 2018లో జన్మించారు.

2017 డిసెంబర్ 31న రాత్రి 11.58కి వకీస్ జూనియర్‌ జన్మించాడు.

20 నిమిషాల తర్వాత అంటే 2018 జనవరి 1న వకీస్ చెల్లెలు ఐతన పుట్టింది.

'నా 35 ఏళ్ల సర్వీస్‌లో ఇలాంటి అద్భుతం చూడలేదు' అని డెలివరీ చేసిన కాలిఫోర్నియా డాక్టర్ సయీద్ తంజిది అన్నారు.

నిజానికి ఈ కవలలు జనవరి 27న పుట్టాల్సి ఉంది. కానీ వాళ్ల అమ్మకు న్యూ ఇయర్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు ముందే భూమి మీదకు వచ్చారు.

2018 సంవత్సరంలో ఈ ఆస్పత్రిలో పుట్టిన తొలి అమ్మాయి ఐతన.

ఆ ఏడాది పుట్టిన తొలి శిశువుకు సుమారు 2 లక్షల రూపాయలు ఇవ్వడం ఆ ఆస్పత్రి సంప్రదాయం.

ఆ సంప్రదాయం ప్రకారం ఐతన తల్లిదండ్రులకు 2లక్షల రూపాయలను ఆస్పత్రి చెల్లించింది.

ఈ డబ్బులతో పిల్లలకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

మా ఇతర కథనాలు:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.