2017లో వచ్చిన సంస్కరణలు భారత ఆర్ధిక వ్యవస్థకు మేలు చేశాయా?
జీఎస్టీ, నోట్ల రద్దు, రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం, సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టే సమయాన్ని ఒక నెల ముందుకు జరపడం, ఇంకా ఇతర ఆర్ధిక బిల్లులకు ఆమోదం తెలపడం వంటి విప్లవాత్మక సంస్కరణలు వచ్చినా 2017లో భారత ఆర్ధిక వ్యవస్థ వాటిని ఆహ్వానిస్తూ సంతృప్తికరంగానే ఉందని ఆర్థిక నిపుణులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు అన్నారు.
అయితే ఇంకా అద్భుతంగా ఉండే అవకాశం ఉన్నా పైన చెప్పిన కారణాల వల్ల అది సాధ్యం కాలేదని అన్నారు. అయితే భారత దేశ ఆర్ధిక వృద్ధి 2017 రెండో అంకంలో పుంజుకుందని చెప్పారు.
ఆర్థిక వ్యవస్థలో 2017లో వచ్చిన మార్పుల ప్రతికూల ధోరణులు మాత్రం క్రమంగా తగ్గుతాయని, అలాగే ఉపాధి అవకాశాల విషయంలో 2018 ప్రోత్సాహకరంగా ఉంటుందని, సంస్కరణలు ఆర్ధిక వ్యవస్థను ఇంకా పటిష్టం చేస్తాయని పుల్లారావు అన్నారు.
మేక్ ఇన్ ఇండియా ఫలితాలు కార్పొరేట్ బ్యాలన్స్ షీట్ల మీద కనిపించడం లేదెందుకని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ప్రపంచవ్యాప్త ఆర్ధిక పరిస్థితులను కారణంగా చూపించారు.
అయితే విదేశీ పెట్టుబడుల మీదనే ఆధార పడకుండా ఉపాధి అవకాశాలు పుష్కలంగా కల్పిస్తూ, నిరుద్యోగ వృద్ధిని దూరం చేస్తూ భారత్ 2018లో విధానాలను ముందుకు తీసుకువస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
2018లో ఎటువంటి సంచలన నిర్ణయాలు లేకుండా ఉంటే ఆర్ధిక వ్యవస్థ స్థిరంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు.
మా ఇతర కథనాలు:
- 'ఆర్థిక వ్యవస్థలో వెలుగు కంటికి కనిపించదా?'
- రిచర్డ్ థేలర్: వ్యక్తిగత ఆర్థిక నిర్ణయాలపై రచనలకు నోబెల్
- దేశ ఆర్థిక వృద్ధిపై పాస్‌పోర్ట్‌ల ప్రభావం ఎంత?
- ఆర్థిక వ్యవస్థ ఎక్కడుంది? అంబానీ ఆస్తి ఎంత పెరిగింది?
- పెద్ద నోట్ల రద్దు: ఆర్థిక రంగాన్ని దెబ్బతీసిన మోదీ జూదం
- శ్రీలంకలో భారత్, చైనా వ్యాపార యుద్ధం!
- 2018: మోదీ ఏం చేయబోతున్నారు?
- రోడ్ల ప్రాజెక్టు నిరుద్యోగులకు ఊరటనిస్తుందా?
- పాకిస్తాన్‌పై ‘ట్రంప్ కార్డ్’తో భారత్‌కు మేలెంత?
- క్రెడిట్ కార్డులు ఇలా పుట్టాయి
- నోట్ల రద్దు: హిట్టా? ఫట్టా?
- మూడీస్ రేటింగ్‌తో మోదీ ప్రతిష్ఠ పెరుగుతుందా?
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: ర్యాంకులు ఇలా ఇస్తారు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)
