ఐసీయూ గ్రాండ్ పా: పిల్లలను ఎత్తుకుంటే కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పగలమా!!
డేవిడ్ డచ్‌మాన్ చిన్నపిల్లల ఏడుపును చిటికెలో మాన్పిస్తారు. అందుకే ఈయన్ను అమెరికాలోని జార్జియాలో ఓ ఆసుపత్రిలో 'ఐసీయూ గ్రాండ్ పా' అని పిలుస్తారు.
ఈ పని తనకు చాలా ఇష్టమని ఆయన అంటున్నారు. 12ఏళ్ల కిందట ఉద్యోగం నుంచి రిటైరై, స్వచ్ఛందంగా ఐసీయూ దగ్గర ఇలా సేవలందిస్తున్నారు.
తల్లిదండ్రులు కూడా బుజ్జగించలేని, అనారోగ్యానికి గురైన పిల్లలను డేవిడ్ సింపుల్‌గా పడుకునేలా చేస్తారు.
కొన్నిసార్లు చిన్నపిల్లలు వాంతి చేస్తారు. మూత్రం కూడా పోస్తారు. అయినా .. పిల్లలను ఎత్తుకుంటే, వారితో ఉంటే కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పగలమా అని అంటున్నారు డేవిడ్.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)