నేపాల్‌లో తల్లులకు చీకటి గదే ప్రసూతి కేంద్రం
నేపాల్‌లో ప్రతి నలుగురిలో ఒకరు విద్యుత్ సదుపాయానికి దూరంగా బతుకుతున్నారు. గ్రామీణ మహిళలు ప్రసవ సమయంలో కనీసం వెలుతురు లేక చీకట్లోనే బిడ్డలకు జన్మనిస్తున్నారు. దానివల్ల ఒక్కోసారి తల్లీబిడ్డలు ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఎంతో కాలంగా ఆడవాళ్లను వేధిస్తున్న ఈ సమస్యకు సోలార్ సూట్‌కేస్ అనే సరికొత్త ఆవిష్కరణ పరిష్కారం చూపిస్తోంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)