లండన్ భూగర్భ రైలులో పేలుడు, 30 మందికి గాయాలు

నైరుతి లండన్‌లోని పార్సన్స్ గ్రీన్‌లో శుక్రవారం బాంబు పేలుడు జరిగింది. భూగర్భ రైల్లో ఈ పేలుడు జరగడంతో పలువురికి గాయాలయ్యాయి. ఒక బోగీ ముందు పేలుడు జరిగిందని, ఆ తర్వాత మంటలు అంటుకున్నాయని ప్రయాణికులు తెలిపారు.

పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. టెర్రరిస్టు నిరోధక విభాగం దీన్ని ఉగ్రవాద దాడిగా అనుమానిస్తోంది.

ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు వచ్చాయి. ఫోటోల్లో ఓ బ్యాగ్‌లో ఓ తెల్లటి బకెట్ కాలుతూ కనిపించింది.

"ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. ఆ శబ్దం పేలుడు జరిగినట్లుగా ఉంది" అని లండన్ నుంచి బీబీసి ప్రతినిధి రిజ్ లతీఫ్ తెలిపారు.

ఒక ప్రయాణికురాలికి ముఖంపై, కాలిపై కాలిన గాయాలైనట్టు బీబీసి విలేకరి ఒకరు తెలిపారు.

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.