నిఖత్ తండ్రి: నెలరోజులుగా ఎంత కష్టపడ్డదంటే...
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ వరుసగా రెండో ఏడాది విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు.
సీనియర్ విభాగంలో దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా ఆమె ఘనత సాధించారు.
దిల్లీ వేదికగా జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) వరల్డ్ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం 50 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో ఆమె 5-0 తేడాతో గెలుపొందారు.
ఫైనల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ వియత్నాం క్రీడాకారిణి న్యూయెన్‌పై విజయం సాధించారు.
ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రెండోసారి గెలుపు కోసం నిఖత్ జరీన్ ఎంత కష్టపడ్డారు? అమ్మాయిలకు బాక్సింగ్ ఎందుకన్న ఆమె బంధువులు ఇప్పుడు ఏమంటున్నారు? వంటి విషయాలు నిఖత్ జరీన్ తండ్రి మాటల్లో చూద్దాం..
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)