త్రిపురలో త్రిముఖ పోరు.. ఓటర్ల మొగ్గు ఎటు?

వీడియో క్యాప్షన్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది.

ఫిబ్రవరి 16న త్రిపుర, 27న నాగాలాండ్, మేఘాలయలో పోలింగ్ జరగనుంది. మార్చ్ 2న ఫలితాలు తెలుస్తాయి.

ఈ మూడు రాష్ట్రాల్లో త్రిపుర.. చాలా కాలం కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఏలుబడిలోనే ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఇక్కడ కాషాయజండా ఎగిరింది.

ప్రస్తుతం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అవకాశాలు ఎలా ఉన్నాయి? బీజేపీ పట్టు నిలుపుకుంటుందా? వామపక్షాలు పునర్వైభవాన్ని సాధించగలవా?

బీబీసీ ప్రతినిధులు కీర్తి దూబే, షానవాజ్ అహ్మద్ అందిస్తున్న కథనం.

దేశ రాజధానికి 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రిపుర.. దిల్లీ న్యూస్‌రూమ్‌లలో పతాక శీర్షికల్లో కనిపించే సందర్బాలు చాలా అరుదు. 2018 ఎన్నికల ఫలితాలు ఆ వాతావరణాన్ని మార్చేశాయి.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 25 ఏళ్ల సుదీర్ఘ వామపక్షాల పాలనకు అడ్డుకట్ట వేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. 60 సీట్లున్న అసెంబ్లీలో 36 స్థానాలు గెలుచుకుంది. వామపక్షాల కంటే బీజేపీకి సీట్లు ఎక్కువగా ఉన్నా.. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 1.37 శాతం మాత్రమే.

ఈసారి ఎన్నికల్లో వామపక్షం కాంగ్రెస్‌తో జట్టు కడితే.. బీజేపీ IPFTతో జత కలిసింది. రెండు కూటములకు తోడు ఈసారి టిప్రా మోతా పార్టీ కొత్తగా రంగంలోకి దిగడంతో రాజకీయ త్రిపుర రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

కొత్త పార్టీకి రాజవంశానికి చెందిన యువరాజు నాయకత్వం వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)