బాహుబలి: 50 కిలోల రోలును 1 నిమిషంలో 10 సార్లు లేపి విసిరేసిన రాజకుమారి
బండలు, గుండ్లు ఎత్తే పోటీ ఇది. పురుషులతోపాటు మహిళలూ ఇందులో పాల్గొన్నారు.
చేత్తో 50, 60 కిలోల బండలను ఎత్తడం, రాతి గుండ్లను ఎత్తి విసరడంలో పోటీలు పెట్టారు.
మహిళల విభాగంలో 50 కిలోల రోలును నిమిషంలో పదిసార్లు ఎత్తి విసిరిన రాజకుమారి ప్రథమ బహుమతి గెల్చుకున్నారు.
నిమిషంలో ఏడుసార్లు రోలు ఎత్తి తంగపుష్పం రెండో బహుమతిని గెల్చుకున్నారు.
తమిళనాడులోని వడలూరు గ్రామంలో ఈ పోటీలు జరిగాయి.
గుండ్లు ఎత్తే పోటీల్లో విజేతలుగా నిలిచిన పురుషులకు తమ ఆడపిల్లలను ఇచ్చి పెళ్లి చేసే ఆచారం గతంలో తమిళనాడులో ఉండేది.
ఇప్పుడు ఆ ఆచారం లేకపోయినా, వివిధ గ్రామాల్లో ఇప్పటికీ ఇలాంటి పోటీలు జరుగుతున్నాయి.
వడలూరు పోటీల్లో గెలిచిన వారికి తమిళనాడు స్పీకర్ నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు.
ఇవి కూడా చదవండి:
- ‘పది రోజుల పసిగుడ్డుతో సహా శిథిలాల కింద సమాధై.. నాలుగు రోజుల పాటు ఎలా బతికానంటే..’
- అకస్మాత్తుగా కుప్పకూలటం, ఐసీయూలో చేరటం పెరుగుతోంది, ఎందుకిలా జరుగుతోంది?
- 'చనిపోయిన వ్యక్తి'ని కోర్టుకు తెచ్చి 14 ఏళ్ల శిక్ష వేయించిన అత్యాచార బాధితురాలి తల్లి, అసలేం జరిగింది?
- ఎల్జీబీటీ: గే, ట్రాన్స్జెండర్ పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు ఎంత కష్టం, ఎలాంటి సమస్యలుంటాయి ?
- శరీరంలో ఐరన్ తగ్గుతోందని ఎలా గుర్తు పట్టాలి, పెరగడానికి ఏం తినాలి-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)