ఈ గుడి ముందున్న గరుడ స్తంభం టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందా?

వీడియో క్యాప్షన్, ఈ గుడి ముందున్న గరుడ స్తంభం టిప్పు సుల్తాన్ ప్రాణాలు కాపాడిందా?

కర్ణాటక రాజధాని బెంగళూరులో హిందూ, ముస్లిం సామరస్యానికి సాక్ష్యంగా నిలిచిందని చెబుతున్న కోటె ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం ఇది.

15వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతున్న ఈ ఆలయంలోని వెంకటేశ్వరస్వామిని మైసూరు సుల్తానుల కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా హిందూ, ముస్లింలు దర్శించుకుంటారని ఇక్కడి అర్చకులు చెబుతున్నారు.

ఈ పురాతన ఆలయానికి హిందూ ముస్లింలు రావడం వెనుక ఉన్న ఆసక్తికరమైన సంగతుల్ని, ఆలయ చరిత్రను తెలియచేసేలా గుడి ఆవరణలోని ఒక గదిలో బోర్డులు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)