Samantha-Myositis: మయోసైటిస్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి?
మయోసైటిస్ అని పిలిచే ఆటో ఇమ్యూన్ వ్యాధి తనకు ఉన్నట్లు కొన్ని నెలల కిందట నిర్ధరణ అయిందని సినీ నటి సమంత శనివారం తెలిపారు.
ఈ వ్యాధికి ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని ఆమె చెప్పారు.
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద త్వరలో విడుదల కానుంది. ఈ నెల 27వ తేదీన యశోద సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
యశోద సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల స్పందన ఎంతో బాగుందంటూ సమంత సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన సమంత తన అనారోగ్యం గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఒక ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు.
'మయోసైటిస్' అనేది అరుదైన వ్యాధి. ఇది కండరాల దీర్ఘకాల వాపునకు సంబంధించినది. ఇందులో రకాలు ఉంటాయి. కొన్ని రకాల మయోసైటిస్ వల్ల చర్మంపై దద్దుర్లు కూడా వస్తాయి.
ఈ వ్యాధిని నిర్ధారించడం కూడా కష్టం. ఇది రావడానికి గల కారణాలు కొన్నిసార్లు తెలియవు. ఈ వ్యాధి లక్షణాలు వేగంగా కనిపించవచ్చు లేదా నెమ్మదిగా కూడా కనిపిస్తాయి.
కండరాల నొప్పులు, అలసట, మింగడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు.
అమెరికాలో ఏడాదికి 1600-3200 వరకు కొత్త కేసులు వెలుగు చూస్తుంటాయని దాదాపు 50 వేల నుంచి 75 వేల మంది ప్రజలు మయోసైటిస్‌తో జీవిస్తున్నారని 'హెల్త్ లైన్' వెబ్‌సైట్ పేర్కొంది.
ఇది పెద్దల్లోనే కాదు, పిల్లలకు కూడా రావచ్చు. పురుషుల కన్నా ఎక్కువగా మహిళలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- జగన్‌పై దాడి కేసు విచారణ ఏమైంది.. ఆ రోజు వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఏం జరిగింది
- సమంత: ‘నేను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా’
- ముస్లింలు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో కరెన్సీ నోట్ల మీద వినాయకుని బొమ్మ ఎందుకు ఉంది?
- సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- ట్రాన్స్ జెండర్ పాత్రలను కూడా మామూలు నటులతోనే చేయించాలా ? ఈ అభ్యంతరాలు ఎందుకు వినిపిస్తున్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)