కాంతార మూవీ రివ్యూ: ఒక హీరోకి ఈ కథ చెప్పి ఒప్పించడం కష్టం

వీడియో క్యాప్షన్, కాంతార మూవీ రివ్యూ: ఒక హీరోకి ఈ కథ చెప్పి ఒప్పించడం కష్టం

ఇది వ‌ర‌కు క‌న్న‌డ సినిమా అంటే... ఓ చిన్న చూపు ఉండేది. అరకొర బ‌డ్జెట్‌తో సినిమాలు తీస్తారని, ఊర మాస్ క‌థ‌ల‌తో రీళ్ళు చుట్టేస్తార‌నే ర‌క‌ర‌కాల అప‌వాదులూ వినిపించేవి.

వాట‌న్నింటినీ దాటుకొని వ‌చ్చి ఈరోజు `కేజీఎఫ్‌` నిల‌బ‌డింది. దేశం మొత్తం క‌న్న‌డ సీమ వైపు చూసేలా చేసింది.

`కాంతార` కూడా అలాంటి సినిమానే. ఈమ‌ధ్యే క‌న్న‌డ‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై.. సంచ‌ల‌న‌మై కూర్చుంది.

ఈ సినిమాని మిగిలిన భాష‌ల్లో డ‌బ్ చేయ‌మ‌ని... నిర్మాత‌పై ఒత్తిడి తీసుకొచ్చారు.

దాంతో... ఇప్పుడు తెలుగులో అదే పేరుతో వ‌చ్చింది. మ‌రి.. కాంతార లో అంత అబ్బుర ప‌రిచే విష‌యాలు ఏమున్నాయి?

క‌న్న‌డ‌లో `క్లాసిక్‌`గా పేరు తెచ్చుకొన్న `కాంతార` తెలుగులోనూ కాంతులు పంచుతుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)