‘ముధోల్ హౌండ్’ కుక్కను ప్రధాని మోదీ భద్రతా బృందంలోకి ఎందుకు తీసుకుంటున్నారు?
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రక్షణ బాధ్యతలు చూస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతా బృందంలోకి స్వదేశీ జాతికి చెందిన ముధోల్ వేట కుక్కలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని కెనైన్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో ఉన్న ఈ కుక్కలు భారతీయ ఇళ్లల్లో సాధారణంగా తినే తిండినే తింటాయి.
ముధోల్ కుక్కల తల, మెడ, ఛాతీ భాగం లోతుగా ఉంటాయి. కాళ్ళు తిన్నగా ఉండి పొట్ట లోపలికి ఉంటుంది. చెవులు కిందికి వంగి ఉంటాయి.
స్వదేశీ జాతుల్లో ఇది పొడవైన కుక్క. ఇది 72 సెంటీమీటర్ల పొడవు ఉండి 20 - 22 కేజీల వరకు బరువుంటుంది. ఇవి రెప్పపాటులో ఒక కిలోమీటర్ దూరం పరుగు పెట్టగలవు. ఇవి క్రీడాకారుల మాదిరిగా దృఢంగా కనిపిస్తాయి. వేట విషయంలో వేరే జాతులు వీటితో పోటీ పడలేవు.
ముధోల్ జాతి కుక్కల లక్షణాలు ఆశ్చర్యపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- సింగిల్ షేమింగ్: ఒంటరిగా జీవించే వ్యక్తులను ఎందుకు జడ్జ్ చేస్తుంటారు? ఒంటరిగా బతికితే తప్పా?
- నరేంద్ర మోదీని రాజులా, యోగిలా కొలిచిన నేపాలీ హిందువులు ఇప్పుడు ఏమంటున్నారు?
- 'వీగర్ ముస్లింలపై చైనా ప్రభుత్వానిది మారణహోమం.. కళ్లుమూసుకుని కూర్చోకండి’
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- వేలంలో కొన్న సూట్కేసులు, ఇంటికి తెచ్చి చూస్తే అందులో మానవ అవశేషాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)