జాతీయ గీతాన్ని 75సార్లు ఆలపించి రికార్డు సృష్టించిన అర్చన

వీడియో క్యాప్షన్, జాతీయ గీతాన్ని 75సార్లు ఆలపించి రికార్డు సృష్టించిన అర్చన

రవీంద్ర నాథ్ ఠాగూర్ రచించిన భారత జాతీయగీతం 'జనగణమన' లో మనం ఒక చరణమే పాడతామని, అందులో మొత్తం 5 చరణాలు ఉన్నాయని చాలామందికి తెలియదు.

ఈ గీతాన్ని మనం 52 సెకండ్లలో ఒక చరణం పాడతాం. అందులో ఇంకా నాలుగు చరణాలు మిగిలి ఉన్నాయి.

75 ఏళ్ల ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కరీంనగర్‌కు చెందిన పండుగ అర్చన, ఠాగూర్ రాసిన జాతీయ గీతాన్ని 75 సార్లు సంపూర్ణంగా పాడి 'వరల్డ్ బుక్ ఆఫ్ రికార్ట్స్'లో స్థానం సంపాదించారు.

మధ్యలో 12 నిముషాల విరామ సమయం కలుపుకుని 7 గంటల వ్యవధిలో 75 సార్లు జాతీయ గీతం మొత్తాన్ని ఆలపించారు అర్చన.

ఆ విశేషాలను ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)