కన్నయ్యలాల్:ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను ఎందుకు హత్య చేశారు, రాజస్థాన్ పోలీసులు ఏం చెప్పారు?

వీడియో క్యాప్షన్, కన్నయ్యలాల్:ఉదయ్‌పూర్‌లో టైలర్‌ను ఎందుకు హత్య చేశారు, రాజస్థాన్ పోలీసులు ఏం చెప్పారు?

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు, ఒక టైలర్ దుకాణంలోకి ప్రవేశించి టైలర్‌ను హత్యచేశారు. హత్య చేస్తుండగా వీడియో తీశారు.

ప్రవక్త మొహమ్మద్‌పై బీజేపీ నేత నూపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రతీకారంగా ఈ హత్య చేసినట్టు వీడియోలో పేర్కొన్నారు.

చనిపోయిన వ్యక్తి కన్నయ్యలాల్‌గా పోలీసులు గుర్తించారు. నిందితులు ఇద్దరినీ రాజ్‌సమంద్ జిల్లాలోని భీమ్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ మహ్మద్ రియాజ్, గౌస్ మహ్మద్‌గా గుర్తించారు. కన్నయ్యలాల్‌ని గొంతు కోసి చంపినట్టు ఇద్దరూ వీడియోలో అంగీకరించారు. ప్రధాని మోదీని కూడా చంపేస్తామని బెదిరించారు.

ఈ ఘటనతో ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసు దర్యాప్తుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందాన్ని పంపింది. ఈ వ్యవహారంపై తీవ్రవాద కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)