You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Putin: నూపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్త వ్యాఖ్యలపై పుతిన్ స్పందించారా? భారత్‌కు సలహా ఇచ్చారా?
- రచయిత, ప్రశాంత్ శర్మ
- హోదా, బీబీసీ డిస్ఇన్ఫర్మేషన్ యూనిట్
బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పై ముస్లిం దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మొహమ్మద్ ప్రవక్త పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల భారత ప్రభుత్వం పై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. ఈ వివాదం నేపథ్యంలో నూపుర్ శర్మను పార్టీ పక్కనపెట్టింది.
భారత్, అరబ్ దేశాల సోషల్ మీడియాలో పుతిన్ చేసిన వ్యాఖ్యలుగా ఒక ప్రకటన వైరల్ అవుతోంది. ఈ ప్రకటన ఇలా ఉంది.
పుతిన్ గత గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, "మహమ్మద్ ప్రవక్తను దూషించడం మతపరమైన స్వేచ్ఛను అవమానించడమే. ఇలాంటి వ్యాఖ్యలు ఇస్లాంను పాటించే ప్రజల మనోభావాలను గాయపరుస్తాయి" అని చెప్పినట్లుగా ఉంది.
ఈ ఫొటోలో పుతిన్, సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ కలిసి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటో ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా వేదికలపై వైరల్‌గా మారింది.
ఇదే ఫోటో కింద మొహమ్మద్ ప్రవక్త ఇస్లాం గురించి పుతిన్ మాట్లాడుతున్నట్లు వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఈ ఫోటోను చూపిస్తూ పుతిన్ భారత్ గురించి చేసిన ప్రకటనగా కొంత మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ ఫొటో ఇప్పటి వరకు భారత్, అరబ్ దేశాల్లోని వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో 50,000 సార్లకు పైగా షేర్ అయింది.
ఈ అంశాన్ని బీబీసీ పరిశీలించినప్పుడు ఈ ఫొటోతో పాటు చేస్తున్న వాదనలు పూర్తిగా తప్పు దారి పట్టించేవిగా ఉన్నాయని తెలిసింది.
అసలు విషయం ఏంటి?
ఒక టీవీ డిబేట్ షోలో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఆమె చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ముస్లిం సమాజం నుంచి వ్యతిరేకత ఎదురయింది.
నూపుర్ శర్మ వ్యాఖ్యలకు ఆగ్రహం చెందిన అరబ్ దేశాల్లోని కొంత మంది ప్రజలు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని ప్రచారం మొదలుపెట్టారు.
ఈ మొత్తం వ్యవహారంలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, సౌదీ రాజు సల్మాన్‌తో కలిసి ఉన్న పాత ఫొటోకు ఒక ప్రకటన కూడా జత చేర్చి వైరల్ చేయడం మొదలయింది.
ఇదంతా పుతిన్ భారత్‌ను ఖండిస్తూ ముస్లిం దేశాలను సమర్ధిస్తున్నట్లుగా చిత్రీకరించారు.
పుతిన్ ఇస్లాం గురించి ఏమన్నారు?
మీడియా నివేదికల ప్రకారం రష్యా అధ్యక్షుడు పుతిన్ 2021 డిసెంబరు 23న జరిగిన వార్షిక పత్రికా సమావేశంలో ఫ్రాన్స్‌కు చెందిన చార్లీ హెబ్డోపత్రిక ఇస్లాం గురించి ప్రచురించిన కార్టూన్ నేపథ్యంలో ఒక ప్రకటన చేశారు. "మొహమ్మద్ ప్రవక్తను అవమానించడం మత స్వేచ్ఛను అగౌరవపరచడం లాంటిదే. ఇలాంటి వ్యాఖ్యలు మతస్థుల విశ్వాసాలను గాయపరుస్తాయి" అని అన్నారు.
పుతిన్ ప్రకటన పూర్తిగా చార్లీ హెబ్డో పత్రికలో ప్రచురణ నేపథ్యంలో చేశారు. ఆయన ప్రకటనకు భారత్‌లో మొహమ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదు.
నూపుర్ శర్మ మొహమ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యల పట్ల పుతిన్ స్పందించలేదు.
సౌదీ రాజుతో పాత ఫొటో
పుతిన్, సౌదీ రాజు సల్మాన్‌తో కలిసి ఉన్న ఫొటోను ఆయన చేసిన ప్రకటనతో కలిపి షేర్ చేశారు. ఆ ఫొటోను గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసినప్పుడు అది 2019 అక్టోబరులో పుతిన్ సౌదీ అరేబియా వెళ్లినప్పటి ఫొటో అని తెలిసింది.
బీబీసీ పరిశోధనలో ఆ ఫొటో, ఫొటోతో పాటు చేస్తున్న వాదనలు నిజం కావని తేలింది.
ఇవి కూడా చదవండి:
- ఆర్ఆర్ఆర్ సినిమాను ‘గే’ చిత్రం అంటున్నారెందుకు
- లక్ష కోట్ల చెట్లతో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను నిర్మూలించవచ్చా?
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్: భారత చరిత్రను మలుపు తిప్పిన ఈ వీరుడి కథ నిజమా, కల్పనా?
- Fake Currency notes: నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలా.. ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి
- ముస్లింలలో కుల వ్యవస్థ ఎలా ఉంది... ఈ మతంలో ఒక కులం వారు మరో కులం వారిని పెళ్ళి చేసుకుంటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)