ఉమ్రాన్ మాలిక్: బుల్లెట్ లాంటి బంతుల వెనుక రహస్యమిదే
ఉమ్రాన్ మాలిక్... తాజా ఐపీఎల్ సంచలనం.
గంటకు 150 కిలోమీటర్ల వేగంతో స్థిరంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఫాస్ట్ బౌలర్.
ఇక ఆయన్ను టీం ఇండియాకు ఎంపిక చేయడమే ఆలస్యమంటూ క్రికెట్ పండితులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు.
సునిల్ గావస్కర్ అయితే ఇంగ్లండ్ టూర్‌కు ఉమ్రాన్‌ను తీసుకెళ్లితీరాలని, షమీ, బుమ్రా, సిరాజ్, ఉమేష్ వంటి బౌలర్లున్నారు కాబట్టి, ఒకవేళ ఆయనకు మ్యాచ్ ఆడే అవకాశం రాకున్నా, రోహిత్ శర్మ, విరాట్ వంటి క్రికెటర్లతో డ్రెసింగ్ రూం పంచుకోవడం మంచి అనుభవం అంటూ మద్దతిస్తున్నారు.
షోయబ్ అఖ్తర్ అంత బౌలింగ్ లెంత్ ఉండదు... బ్రెట్ లీతో పోల్చినా తక్కువ దూరమే పరుగెడుతున్నాడు. కానీ గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో స్థిరంగా 8 నుంచి 10 ఓవర్లు బౌలింగ్ చేయగల్గుతున్నాడు. అసలు ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ రహస్యమేంటి? ఫాస్ట్ బౌలింగ్ విషయంలో ఇన్నాళ్లూ ఉన్న భ్రమల్ని ఉమ్రాన్ బద్దలుకొడుతున్నాడా..? ఫాస్ట్ బౌలింగ్ వెనుక అసలు సీక్రెట్స్ ఏంటి?
పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- పామును కిరీటంగా ధరించిన 4500 ఏళ్ల పురాతన దేవతా విగ్రహం.. పొలంలో రైతుకు దొరికింది
- యుక్రెయిన్ యుద్ధంపై కలసికట్టుగా ఉన్న పాశ్చాత్య దేశాలు విడిపోతే ఏం జరుగుతుంది? - మీరు తెలుసుకోవాల్సిన 5 అంశాలు
- అజయ్ దేవ్‌గణ్-కిచ్చా సుదీప్: హిందీ జాతీయ భాషా? భారతదేశంలో అధికార భాషలు ఏవి?
- పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చిన వరుడు.. మరొకర్ని పెళ్లి చేసుకున్న వధువు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)