అనంతపురం: గాడిదలకు పరుగు పందెం

వీడియో క్యాప్షన్, అనంతపురం: గాడిదలకు పరుగు పందెం..

అనంతపురం జిల్లా వజ్రకరూర్లో జనార్దన వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా గాడిదల పరుగు పోటీని నిర్వహించారు.

గాడిదలపై వాటి యజమానులు కూర్చొని సవారీ చేసి లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ పోటీలో గుర్రాలకు తామేమీ తీసిపోమంటూ పరుగులు తీశాయి గాడిదలు.

ఈ పోటీలను క్రీడామైదానంలో కాకుండా రోడ్డుపై నిర్వహించారు. వజ్రకరూరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి వజ్రకరూరుకు వచ్చే విధంగా మొత్తం 18 కిలోమీటర్ల దూరం ఈ గాడిదల రన్నింగ్ రేస్ నిర్వహించారు.

ఈ రేసులో చివరకు మూడు గాడిదలు మాత్రమే మిగిలాయి. ప్రతీ సంవత్సరం ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, కరోనా కారణంగా గత రెండేళ్లు నిర్వహించలేక పోయామని నిర్వాహకులు రాఘవ, రమణలు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)