యుక్రెయిన్‌కు అంతమంది వైద్య విద్యార్థులు ఎందుకు వెళ్లారు?
యుక్రెయిన్‌లో సుమారు 20 వేల మంది భారతీయులు అందులోనూ ఎక్కువమంది విద్యార్ధులు ఉన్నట్లు అంచనా. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాల విద్యార్ధులు ప్రధానంగా మెడిసిన్, ఇంకా ఇతర కోర్సులు చదివేందుకు యుక్రెయిన్‌లో ఉన్నారు.
యుద్ధం కారణంగా ఇప్పుడు వారందరినీ ఇప్పుడు స్వదేశానికి తీసుకురావడం విదేశాంగ శాఖ, దౌత్యాధికారులకు సవాలుగా మారింది. ఇప్పటికే వందలమంది స్వదేశానికి చేరుకోగా, మిగిలిన వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి.
అయితే, ఇదే సమయంలో యుక్రెయిన్ రష్యా యుద్ధం, దానితో సంబంధం లేని ఒక కొత్త చర్చను లేపింది. భారతదేశాన్ని వదలి ఎందరో విద్యార్థులు అక్కడ ఎందుకు మెడిసిన్ చదువుతున్నారన్న ప్రశ్న వచ్చింది.
అంత చిన్న దేశాల్లో భారత విద్యార్థులు మెడిసిన్ చదవడం వల్ల ఎన్నో కోట్ల రూపాయల సొమ్ము అక్కడకు చేరుతోందని ప్రధాని మోదీ స్వయంగా వ్యాఖ్యానించారు. దానిపై రకరకాల విమర్శలు, వ్యాఖ్యానాలూ వచ్చాయి. మరి డాక్టర్ పట్టా కోసం భారత యువత వెళ్లేంతగా అక్కడ ఏముంది?
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ ఎలా ఏర్పడింది, రష్యాతో దానికి ఉన్న చారిత్రక బంధం ఏమిటి
- అణు ఆయుధాలంటే ఏమిటి? ఏఏ దేశాల దగ్గర ఎన్నెన్ని అణుబాంబులు ఉన్నాయి?
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
- 'మాకూ ఇరాన్, ఉత్తరకొరియా పరిస్థితి వస్తుందేమో'.. రష్యన్లలో ఆందోళన
- 'బాంబులకు బాబు' వ్యాక్యూమ్ బాంబు.. థర్మోబారిక్ బాంబు అంటే ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)