ఓఐసీలో భారత్ సభ్యత్వానికి పాకిస్తాన్ ఎందుకు అభ్యంతరం చెప్తోంది

వీడియో క్యాప్షన్, ఓఐసీలో భారత్ సభ్యత్వానికి పాకిస్తాన్ ఎందుకు అభ్యంతరం చెప్తోంది

భారతదేశానికి ఓఐసీలో అబ్జర్వర్ స్టేటస్ ఇవ్వాలని గతంలో సౌదీ రాజు అన్నారు. కానీ, ఓఐసీలో పరిశీలకుల హోదా కోరుకునే ఏ దేశానికైనా అందులోని సభ్య దేశాలతో వివాదాలు ఉండకూడదని పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

నిజానికి ప్రపంచంలో ఇండోనేషియా తరువాత భారతదేశంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉంది. మూడవ స్థానంలో పాకిస్తాన్ ఉంది.

2015 గణాంకాల ప్రకారం ఇండోనేషియాలో 87.1 శాతం ముస్లింలు ఉండగా, భారతదేశంలో 14.9 శాతం ఉన్నారు.

అయితే, 2060 నాటికి భారతదేశంలో ముస్లింల సంఖ్య పెరిగి మొదటి స్థానానికి చేరుకుంటుందని, పాకిస్తాన్ రెండవ స్థానంలో ఉంటుందని ప్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా వేసింది.

ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం ముస్లిం జనాభాలో 11.1 శాతం భారతదేశంలో ఉన్నారు. ఇండోనేషియాలో 12.6 శాతం, పాకిస్థాన్‌లో 10.5 శాతం ఉన్నారు.

ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఓఐసీ) అనేది ఇస్లామిక్ దేశాల సంఘటిత సంస్థ. ఇందులో 57 సభ్య దేశాలు ఉన్నాయి.

ఓఐసీలో సౌదీ అరేబియా ఆధిపత్యం చలాయిస్తుంది. కానీ, ముస్లిం జనాభా అధికంగా ఉన్న మొదటి 10 దేశాల్లో సౌదీ అరేబియా లేదు. అయితే, ముస్లింలకు పవిత్ర స్థలాలైనా మక్కా, మదీనాలు సౌదీ అరేబియాలో ఉండడంతో ఆ దేశం ప్రాముఖ్యం సంతరించుకుంది.

ఓఐసీలో భారత్ సభ్యత్వానికి పాకిస్తాన్ ఎందుకు అభ్యంతరం చెప్తోంది?

ముస్లిం జనాభాలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్‌లో చోటు ఎందుకు దక్కడం లేదు?

టర్కీ లాంటి లౌకిక దేశాలు సభ్యులుగా ఉన్న OICలో భారత సభ్యత్వానికి పాకిస్తాన్ ఎలా అడ్డుపుల్లలు వేస్తోంది? పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)